తెలుగులో జాన్వీకపూర్...
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో డెబ్యూ చేయనుందా? అంటే అవుననే ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. వివరాల్లోకెళ్తే రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో `ఆర్ ఆర్ ఆర్` సినిమా తెరకెక్కబోయే సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ ఫైనలైజ్ అయ్యారు. ఇప్పుడు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో రామ్‌చరణ్ జతగా జాన్వీకపూర్‌ను నటింప చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట.
ఆ దిశగా చర్చలు జరగుతున్నాయి. కరణ్ జోహార్ కూడా జాన్విని తెలుగులో నటింప చేయడానికి ఆసక్తిగానే ఉన్నారు. ఈ చిత్రాన్ని దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్నారు. ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ అల్యూమినిమయం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments