బాలయ్య గురించి ఎన్టీఆర్ ని ప్రశ్నించిన జగపతి
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలక్రిష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్...ఈ బాబాయ్ - అబ్బాయ్ మధ్య వ్యక్తిగతంగా మనస్పర్ధలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా బాబాయ్ డిక్టేటర్ మూవీని, అబ్బాయి నాన్నకు ప్రేమతో మూవీని రిలీజ్ చేస్తుండడంతో పోటీ మరింత ఆసక్తిగా మారడంతో పాటు బాలయ్య, ఎన్టీఆర్ మధ్య పోటీ అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ గా మారింది.
ఇదే విషయం గురించి ఎన్టీఆర్ తో జగపతి మాట్లాడుతూ...బాలయ్య కి నీకు మధ్య ప్రొబ్లమ్ ఏమిటి అని అడిగితే....నాకు ఆయనతో ఏ ప్రొబ్లం లేదు. అసలు ప్రొబ్లం ఏమిటో తెలియదు. ఏ గొడవ లేదు. ఆయన మా నాన్న బ్రదర్.. అంటే నాకు నాన్నతో సమానం. దేనికైనా నేను ఓపెన్ గా ఉన్నాను అని చెప్పాడట ఎన్టీఆర్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ బాలయ్య గురించి ఎక్స్ ట్రా మాట మాట్లాడలేదు ఇది అందరికీ తెలియాలని చెబుతున్నాను అని అంటున్నారు జగపతి. మరి..ఈ విషయం పై బాలయ్య స్పందిస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments