మే 5 నుండి జగపతిబాబు 'సూర్యాభాయ్ ' చివరి షెడ్యూల్ షూటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్, శ్రీ తిరుమల సినిమాస్ పతాకాలపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'సూర్యాభాయ్'. బి.వి. రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఇప్పటి వరకు 3 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ని మే 5 నుండి జరుపనున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం మాట్లాడుతూ..'' అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. టైటిల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో జగపతిబాబు గారి పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పొలిటికల్ సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుంది. సెంటిమెంట్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అర్జున్ వాసుదేవ్ తీర్చిదిద్దుతున్నారు. ప్రదీప్‌రావత్, షాయాజీషిండే, సుమన్, సాయికుమార్, డి.ఎస్.రావ్, అర్చన ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్ జగపతిబాబుగారి సరసన నటిస్తుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని లావిష్‌గా తెరకెక్కిస్తున్నాము. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్‌డూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం.
మే 5 నుండి జరిపే చివరి షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. జూన్‌లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసి జూలైలో ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం..''అన్నారు.
ఓ ప్రముఖ హీరోయిన్ జగపతిబాబు సరసన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో షాయాజీషిండే, ప్రదీప్‌రావత్, సుమన్, సాయికుమార్, డి.ఎస్.రావ్, రాజారవీంద్ర, ఉత్తేజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, దిల్ రమేష్, అర్చన తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.వి. రామకృష్ణ, సంగీతం: ఆనంద్, ఆర్ట్: జె.కె. మూర్తి, ఫైట్స్: నందు, పి.ఆర్.ఓ. జిల్లా సురేష్, నిర్మాతలు: రాజేష్ చిన్నారి, ప్రతాప్ దండెం, దర్శకత్వం: అర్జున్ వాసుదేవ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments