నా గురువు & నా హీరోకు జన్మదిన శుభాకాంక్షలు - జగపతి..!
Send us your feedback to audioarticles@vaarta.com
నా గురువు & నా హీరోకు జన్మదిన శుభాకాంక్షలు అని జగపతి బాబు ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఇంతకీ...జగ్గుభాయ్ బర్త్ డే విషెష్ చెప్పింది ఎవరికి అని అనుకుంటున్నారా..? జగపతి బాబు చెప్పింది ఆయన తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ కి. నటుడు అవ్వాలని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు వి.బి.రాజేంద్రప్రసాద్.
అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న వి.బి.రాజేంద్రప్రసాద్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా జగపతిబాబు ట్విట్టర్ లో స్పందిస్తూ...నా ఇన్ స్పిరేషన్, నా గరువు, నా హీరో మై డియర్ డాడ్. మిస్సింగ్ యు నాన్నగారు. మీరు స్ధాపించిన జగపతి సినిమాను మీ ఆశీస్సులతో నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళతాను అంటూ తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ ఫోటో పోస్ట్ చేసారు జగ్గుభాయ్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments