నిర్మాతల కోసం అయినా 'ఆటగాళ్ళు' చిత్రం ఆడాలి - జగపతిబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్ హీరోగా దర్శన బానిక్ హీరోయిన్ గా జగపతిబాబు ముఖ్యపాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ఆటగాళ్లు. నవ నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజిప్రసాద, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్ట్ 24న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.
జగపతిబాబు మాట్లాడుతూ - "ఆటగాళ్లు లాంటి సినిమా చేయడం కొంతవరకు రిస్కె. అయినా నిర్మాతలు బడ్జెట్ కి ఎక్కడా వెనకాడకుండా సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీసన్ డైరెక్టర్ మురళి. నాతో పెదబాబు సినిమా చేసాడు. త్రివిక్రమ్ నాతో ఓ సారి మాట్లాడుతూ మురళి మంచి విషయం ఉన్నోడు అని చెప్పాడు. అది చాలా గ్రేట్. అందుకే ఈ సినిమా చేసాను. ఫైనల్ ఔట్ ఫుట్ చూసాక చాలా హ్యాపీగా ఉంది. క్రైం, కోర్టు డ్రామా, అన్నీ చాలా కొత్తగా ఉంటుంది. స్క్రీన్ ప్లై బాగా వర్కవుట్ అయింద. ఆటగాళ్లు గ్యారెంటీ గా సక్సెస్ అవుతుంది. మేము అంత బాగా ఇన్వాల్వ్ అయి ఈ సినిమా చేసాం. మా కోసం కాకా పోయినా నిర్మాతల కోసం ఈ చిత్రం ఆడాలి. విజయ్ సి కుమార్ ఫోటోగ్రఫీ, సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ గా నిలుస్తాయి. ట్రైలర్ కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఫస్ట్ టైం లాయర్ క్యారెక్టర్ చేసాను. రోహిత్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేసాడు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు".
నారా రోహిత్ మాట్లాడుతూ "- బాణం, ప్రతినిధి, రౌడీఫెలో, చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసాను. ఆటగాళ్లు చిత్రం కొత్త జోనర్ నాకు. ఇలాంటి చిత్రాన్ని నన్ను కన్వినెన్స్ చేసి తీసిన పరుచూరి మురళి కి నా థాంక్స్. సాయి కార్తీక్ తో ఇది ఏడవ సినిమా. రీ రికార్డింగ్ పెంటాస్టిక్ గా చేసాడు.విజయ్ గారితో ఫస్ట్ సినిమా. విజువల్స్ అద్భుతంగా ఇచ్చారు. గోపి మోహన్ సుపర్బ్ డైలాగ్స్ రాసారు. నేను చాలా సినిమాలు చేసాను. రిజల్ట్ విషయం పక్కన పెడితే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశానని తృప్తి కలిగింది. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు".
దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ "- ఈ సినిమాకి నా ఫ్రెండ్స్ నిర్మాతలు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. సీనియర్ డైరెక్టర్ గా కాకుండా నా ఫస్ట్ ఫిల్మ్ లా భావించి ఈ సినిమా చేసాను. జగపతిబాబు, రోహిత్ గారు స్క్రిప్ట్ నమ్మి నా మీద నమ్మకంతో చేశారు. ఈ సినిమాని దియటర్ దాకా తీసుకెళ్తున్న నా నిర్మాతలు నిజమైన హీరోలు. సాయి కార్తీక్ తన మ్యూజిక్ తో ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. విజయ్ సి కుమార్ గారి ఫోటోగ్రఫీ సినిమాకి ప్రాణం. నాకు కుడిబుజంలా ఉండి సినిమాని అత్యద్భుతంగా తీశారు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి నా టెక్నికల్ టీమ్ మెయిన్ కారణం. వారందరికీ నా థాంక్స్ అన్నారు".
నిర్మాతల్లో ఒకరైన వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ "- సినిమాని సక్సెస్ ఫుల్ గా తీసి ఆగస్ట్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. విజయ్ సి కుమార్ గారి కెమెరా వర్క్, మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్, సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకి హైలైట్స్ అవుతాయి. ఫ్రెండ్ కోసం ఒక పర్పస్ తో ఈ సినిమా చేసాం. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. గ్యారెంటీగా ఈ చిత్రం హిట్ అవుతుంది అన్నారు". ఇంకా ఈ కార్యక్రంలో కెమెరామెన్ విజయ్ సి కుమార్, రచయిత గోపిమోహన్, నటులు శ్రీతేజ, ఫణి, "ఆటగాళ్లు" సినిమా హిట్ అవుతుందని అన్నారు".
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments