ఆ హీరోతో చేయాలనుందని అంటున్న తెలుగు స్టార్

  • IndiaGlitz, [Saturday,August 08 2015]

హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ గా సినిమాలు చేస్తున్న హీరో జగపతి బాబు ఇప్పుడు చేతి నిండా ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శ్రీమంతుడు' చిత్రంలో మహేష్ తండ్రిగా కూడా అలరించాడు. తమిళంలో రజనీకాంత్ సరసన కూడా నటించిన జగపతి బాబు ప్రస్తుతం శింబు, సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో రానున్న కాన్' అనే చిత్రంలో బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అయితే తమిళంలో వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ అయిన అజిత్ చిత్రంలో విలన్ గా అయినా, ఏదేని చిన్న క్యారెక్టర్ అయిన చేయాలనుందని తన మనసులో మాటను ఇటీవల చెప్పుకొచ్చాడు.