జగపతి సినిమా బ్యానర్ పై రెండు చిత్రాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. దీనికి నిదర్శనమే బాహుబలి చిత్రం. తెలుగులో రూపొందిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పెరుగుతున్న మార్కెట్ కి తగ్గట్టు ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ అవసరం ఉంది. అయితే..అభిరుచి, ఆసక్తి ఉన్నా.. అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను ఎలా నిరూపించుకోవాలో తెలియని పరిస్థితి. ఈ రంగంలో కొత్త వారి కోసం సరైన వేదిక లేదనుకునే తరుణంలో జగపతిబాబు, ఔత్సాహికుల కోసం 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థతో కలిసి జగపతి సినిమా బ్యానర్ పై జగపతిబాబు రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ...ఇండస్ట్రీకి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అవసరం ఎంతైనా ఉంది. అందుచేత టాలెంట్ ఉన్న వాళ్లకు మా సంస్థ అండగా ఉంటుంది. ఇంట్రస్ట్ ఉన్న వాళ్లు మా పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే సినిమా నిర్మాణం తరువాత దానికి సంబంధించిన వ్యాపారంలో, సినిమా ప్రచారంలో కూడా క్లిక్ సినీ కార్ట్ నిర్మాతకు అండగా నిలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే క్లిక్ సినీ కార్ట్... 'వన్ స్టాప్ హబ్. ప్రస్తుతం హైదరాబాద్లో మా సంస్థ ఆఫీస్ ఉంది. త్వరలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యు.కె లో కూడా మా సంస్థ ఆఫీస్ ను ప్రారంభించనున్నాం అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com