తేజు తండ్రిగా జగపతి..

  • IndiaGlitz, [Wednesday,June 15 2016]

లెజెండ్ సినిమాతో రూటు మార్చి విల‌న్ గా న‌టించిన‌ జ‌గ‌ప‌తిబాబు వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ...అంద‌ర్ని అల‌రిస్తున్నాడు. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుని విల‌న్ గా న‌టించి.. మెప్పించి.. అంద‌రి అభినంద‌న‌లు అందుకున్నాడు. లెజెండ్ త‌ర్వాత పిల్లా నువ్వు లేని జీవితం, శ్రీమంతుడు, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలా విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో విభిన్న‌పాత్ర‌లు పోషించాడు. దీంతో ఒక్క‌ తెలుగులోనే కాదు..త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో కూడా న‌టిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు జ‌గ‌ప‌తి.
మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన పిల్లానువ్వు లేని జీవితం చిత్రంలో న‌టించిన జ‌గ‌ప‌తి మ‌ళ్లీ ఇప్పుడు తేజు చిత్రంలో న‌టిస్తున్నాడ‌ట‌. తేజు ప్ర‌స్తుతం తిక్క సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తేజు న‌టిస్తున్నాడు. ఈ చిత్రంలో తేజు తండ్రిగా జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నాడ‌ట‌. ఈ పాత్ర ఈ చిత్రానికి చాలా ముఖ్య‌మైన పాత్ర అట‌. అందుక‌నే పాత్ర న‌చ్చ‌డంతో జ‌గ‌ప‌తి ఓకే చెప్పాడ‌ట‌.

More News

వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న రోబో 2

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రోబో. సంచ‌ల‌న విజ‌యం సాధించిన రోబో చిత్రానికి సీక్వెల్ గా రోబో 2.0 చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే.

నాగ్ మూవీలో అనుష్క రోల్ ఇదే..

కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో మరో భక్తిరసచిత్రం రూపొందుతుంది.

శంకర్ హీరోయిన్ డేటింగ్....

శంకర్ ఐ చిత్రంలో మెప్పించిన బ్రిటీష్ భామ ఎమీజాక్సన్ తర్వాత విజయ్ థెరిలో కూడా నటించింది.

ట్విట్టర్ లో రజనీ కొత్త రికార్డ్...

సూపర్ స్టార్ రజనీకాంత్..సినిమాల్లోనే కాదు.,ఏదీ చేసినా సంచలనమే,రికార్డులే.

మూడు భాషల్లో మహేష్ - పూరి జన గణ మన....

సూపర్ స్టార్ మహేష్ - డేరింగ్ &డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన పోకిరి,