సినిమా ఛాన్స్ ఇవ్వ‌డానికి జ‌గ్గుభాయ్ రెడీ..మ‌రి మీరు..?

  • IndiaGlitz, [Thursday,December 15 2016]

సినిమా రంగం పై అభిరుచి, ఆసక్తి ఉన్నా..చాలా మందికి అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను ఎలా నిరూపించుకోవాలో తెలియని ప‌రిస్థితి. అందుక‌నే సినీ రంగంలో ప్ర‌వేశించాల‌నుకునే ఔత్సాహికుల కోసం జ‌గ‌ప‌తిబాబు 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ‌తో క‌లిసి జ‌గ‌ప‌తి సినిమా బ్యాన‌ర్ పై జ‌గ‌ప‌తిబాబు రెండు చిత్రాలు నిర్మించ‌నున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు.

అలాగే టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కు మా సంస్థ అండ‌గా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఈ విష‌యం పై జ‌గ‌ప‌తిబాబు ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...టాలెంట్ ఉన్న ఆర్టిస్టుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డానికి మేము రెడీగా ఉన్నాం.క్లిక్ సినీ కార్ట్ టీమ్ మ‌రియు నేను వైజాగ్ వ‌చ్చి

జౌత్సాహికులను సెలెక్ట్ చేయనున్నాం. మీరు రెడీనా..? పూర్తి వివ‌రాల కోసం క్లిక్ సినీ క్లార్ట్ ను సంప్ర‌దించండి అంటున్నారు జ‌గ్గుభాయ్. సినిమా ఛాన్స్ ఇవ్వ‌డానికి జ‌గ్గుభాయ్ రెడీగా ఉన్నారు. మ‌రి...ఇంకెందుకు ఆల‌స్యం..ఆస‌క్తి ఉన్న వాళ్లు రెడీ అవ్వండి..!