నాగ్ తో ఫైట్ చేయనున్న జగ్గుభాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఊపిరి సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మార్చి 25న ఊపిరి చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే...నాగ్ తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ తో దిల్ రాజు సినిమా ప్రారంభించారు. ఆ సినిమా కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. ఆ సినిమాను నాగ్ తో నిర్మించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. నాగ్ ఇమేజ్ కి తగ్గట్టు కథలో మార్పులు చేస్తున్నారట. అలాగే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జగపతిబాబును సంప్రదిస్తున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే నాగ్ - జగ్గుభాయ్ హీరో - విలన్ గా నటించవచ్చు. మరి..నాగ్ దిల్ రాజు కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..? లేదో..? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com