హిందీ సినిమా సీక్వెల్లో జగపతిబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన గబ్బర్ సింగ్ తెలుగు నాట వసూళ్ళ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఒరిజనల్ వెర్షన్ అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్ కూడా బాలీవుడ్లో బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత అదే సినిమాకి దబాంగ్ 2 పేరుతో సీక్వెల్ వచ్చింది. అది కూడా మంచి విజయం సాధించింది. ప్రభుదేవా దర్శకత్వంలో ఇప్పుడు దబాంగ్ మూడో భాగం రూపొందుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో జగపతిబాబు విలన్గా నటించనున్నాడని తెలిసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రతినాయకుడిగా రాణించిన జగపతిబాబు హిందీలో కూడా ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి. ఇటీవల రంగస్థలంలో ఆయన పోషించిన ప్రతినాయకుడి పాత్రకి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com