బోయపాటి మూవీలో సరికొత్త పాత్రలో జగ్గుభాయ్..!
Wednesday, December 14, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సరైనోడు సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం వైజాగ్ లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
లెజెండ్ సినిమాతో జగపతిబాబును విలన్ గా పరిచయం చేసిన బోయపాటి ఈ చిత్రంలో జగపతిబాబుతో ఓ ముఖ్యమైన పాత్ర చేయిస్తున్నారు. జగపతి కెరీర్ లో మరచిపోలేని పాత్రను లెజెండ్ సినిమాలో చేయించిన బోయపాటి ఈ చిత్రంలో కూడా జగపతిబాబు కోసం డిఫరెంట్ రోల్ డిజైన్ చేయడం విశేషం. రెండో షెడ్యూల్ లో హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో పాటు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం - దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్ - రిషి పంజాబి, ఆర్ట్ - షహి సురేష్, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్, స్టిల్స్ - జీవన్, డైలాగ్స్ - ఎం.రత్నం, ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి, డైరెక్టర్ - బోయపాటి శ్రీను
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments