ఆనందయ్యపై జగపతిబాబు కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ప్రస్తుతం నేషనల్ ఫేమస్. ఆయన కరోనా రోగులకు ఇస్తున్న మందు బాగా పనిచేస్తోందని జనాల నుంచి ఫీడ్ బ్యాక్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆయనపై మీడియా అటెన్షన్ పెరిగింది. మరోవైపు ప్రభుత్వం రంగంలోకి దిగింది.
కేంద్ర వైద్య సంస్థలు రంగంలోకి దిగి ఆనందయ్య వైద్యంపై పరిశోధనలు చేస్తున్నాయి. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆనందయ్య ఇస్తున్న మందుని ఆయుర్వేదంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఆనందయ్య వైద్యంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఆనందయ్యకు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చదవండి: RRR ఫైట్స్.. ఉత్కంఠ పెంచేసిన విజయేంద్ర ప్రసాద్
తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు ఆనందయ్యకు మద్దతు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రకృతి తల్లే మనల్ని రక్షించడానికి వచ్చినట్లు ఉంది. ఆనందయ్య గారి వైద్యం అధికారికంగా ధృవీకరించబడాలని, ప్రపంచం మొత్తం కరోనా నుంచి సేవ్ కావాలని ప్రార్థిస్తున్నా' అంటూ జగపతి బాబు ట్వీట్ చేశారు.
ఇటీవల వివాదాస్పద దర్శకుడు వర్మ ఆనందయ్య వైద్యంపై సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మద్దతుదార్లు మెడికల్ మాఫియా ఆయన్ని అడ్డుకుంటోంది అంటూ విమర్శలు చేస్తున్నారు. అలాగే మరికొందరు మాత్రం ఇలాంటి వైద్యాలని గుడ్డిగా నమ్మకూడదు అని అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS
— Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments