‘సలార్’లో రాజమన్నార్‌గా జగపతిబాబు.. లుక్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ `సలార్`. కె.జి.యఫ్ ఛాప్టర్ 1తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసి, కె.జి.యఫ్ ఛాప్టర్2తో మరో సెన్సేషన్‌కు సిద్ధమవుతూ లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను నిర్మిస్తోన్న హోంబలే ఫిలింస్ నిర్మిస్తోన్న భారీ మాస్, యాక్షన్, అడ్వెంచరస్ మూవీ ‘సలార్’.శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని మరో పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రాజమన్నార్ అనే పాత్రను విలక్షణ నటుడు జగపతిబాబు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇది చాలా కీలకమైన పాత్ర. ఈ లుక్ పోస్టర్‌కు టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుంది. సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉందీ పోస్టర్.
కె.జి.యఫ్ సిరీస్ తర్వాత హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇప్పటికే 20 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి 2022లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది.
ఈ సందర్భంగా హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ‘‘సలార్’ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాలో రాజమన్నార్ అనే ఓ కీలక పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశాం. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకమైనదే కాదు, సినిమా మెయిన్ టర్నింగ్ పాయింట్‌కు ఈ పాత్రే కారణంగా ఉంటుంది’’ అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ‘సలార్’ షూటింగ్ చకచకా జరగుతుంది. ఈ సినిమాలోని మిగిలిన పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments