రాజకీయ నాయకుడి పాత్రలో జగపతి బాబు?
Send us your feedback to audioarticles@vaarta.com
కొంత కాలం స్తబ్దుగా ఉన్న కెరీర్ను.. సెకండ్ ఇన్నింగ్స్లో భిన్నమైన పాత్రలతో పరుగులు పెట్టిస్తున్నారు జగపతి బాబు. ఓ పక్క తండ్రి పాత్రలు పోషిస్తూనే.. అవకాశం చిక్కినప్పుడల్లా ప్రతినాయకుడి పాత్రల్లో హీరోకి ధీటుగా నటించి మెప్పిస్తున్నారు ఈ సీనియర్ కథానాయకుడు. ప్రస్తుతం రవితేజ, కళ్యాణ్ కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న 'నేల టికెట్' (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలో.. ప్రతినాయక ఛాయలున్న ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలోజగపతి బాబు నటిస్తున్నారని తెలిసింది.
రవితేజ పాత్రతో సమానంగా ఈ పాత్రను దర్శకుడు తీర్చిదిద్దారని అంటున్నారు. తొలిసారిగా ఓ విభిన్నమైన పాత్రను జగపతి బాబు ఈ చిత్రంలో చేస్తున్నారని.. రవితేజతో సాగే సన్నివేశాలు నువ్వా? నేనా? అన్నట్టుగా సాగుతాయని.. ఇవి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. 'ఫిదా' సంగీత దర్శకుడు శక్తి కాంత్ కార్తిక్ స్వరాలను సమకూరుస్తున్న ఈ కుటుంబ కథా చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com