మహేష్ మాదిరిగానే ఎన్టీఆర్ క్కూడా..
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ బాబు కెరీర్లో మెమరబుల్ మూవీగా నిలిచింది 'శ్రీమంతుడు' సినిమా. టాలీవుడ్ టాప్ 2 హిట్‌గా ఈ సినిమా స్థానం దక్కించుకుంది కూడా. అలాంటి 'శ్రీమంతుడు' సినిమాలో భాగమయ్యారు నిన్నటి తరం కథానాయకులు జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్. ఈ ఇద్దరూ సీనియర్ కథానాయకులు మరో స్టార్ హీరో సినిమా కోసం కూడా అతి త్వరలో సందడి చేయనున్నారు.
అదే ఎన్టీఆర్ నటిస్తున్న 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కథకు కీలకమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నారని ఇన్సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. మహేష్‌కి కలిసొచ్చినట్లుగానే ఎన్టీఆర్ క్కూడా ఈ ఇద్దరు సీనియర్స్ కలిసొస్తారని ఆశిద్దాం. 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com