పోలవరం తర్వాత జగన్ మరో షాకింగ్ నిర్ణయం!
- IndiaGlitz, [Tuesday,September 17 2019]
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకుని ఇప్పటివరకూ అన్ని సంచలన, కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఇందుకు ఆయన వందరోజుల పాలనే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం జగన్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే.. పోలవరం కాంట్రాక్టును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో జరుగుతున్న 3,543 రహదారి పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. కాగా.. ఈ పనుల విలువ రూ.1,031.17 కోట్లు ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు దీంతో పాటు ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపడుతున్న పనులను కూడా తక్షణమే ఆపేయాలని జగన్ సర్కారు నిలిపివేసిందని తెలుస్తోంది. కాగా.. 2018, ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.