Jagananna Suraksha: అందరికీ రక్షణగా జగనన్న ఆరోగ్య సురక్ష

  • IndiaGlitz, [Monday,November 06 2023]

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క.. అన్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని ఆయన సంకల్పించారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, ఇల్లు కదల్లేని వాళ్లు, వీరందరికీ వైద్యం ఎలా అందించాలి.. ఎవరు చికిత్స చేస్తారు. వాళ్లను ఎవరు పట్టించుకుంటారు. ఎవరూ తోడులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఇప్పడు అలాంటి వారికి సీఎం వైయస్ జగన్ దేవుడయ్యారు. తన ప్రతినిధులుగా ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపిస్తున్నారు.

గుమ్మం ముందుకే వైద్యం..

ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు ఇస్తున్నారు. అవసరమైతే పెద్ద ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇంటింటికి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రాకతో ప్రజలకు తమ గుమ్మం ముందే వైద్యం అందుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం కోట్లాది మందికి సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతూ ప్రతి ఇంటా ఆరోగ్యాన్ని పంచుతోంది.

వేలల్లో వైద్య శిబిరాలు.. లక్షల్లో చికిత్సలు..

ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12,000 వైద్య శిబిరాలు నిర్వహించగా 60.9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అందులో 59.2 లక్షల మందిని వైద్య సిబ్బంది, డాక్టర్లు పరీక్షించారు. ఇప్పటివరకూ 1.44 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు. 3.78 కోట్ల మందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 13,930 వరకూ శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఇక 1.38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఇంటింటికీ వైద్యం అందిస్తున్న సీఎం అందరి ఇళ్లలో దేవుడిగా నిలిచారు.

More News

ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నెదర్లాండ్స్ వేదికగా ప్రశంసలు..

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలపై అంతర్జాతీయ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Game Changer : రామ్ చరణ్ - శంకర్ ‘‘గేమ ఛేంజర్’’ సినిమా సాంగ్ లీక్ , ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్

అప్పట్లో పైరసీ భూతం తెలుగు సినిమాను పట్టి పీడంచగా.. ఇప్పుడు లీకులు బెడద వెంటాడుతోంది.

AP GST:జీఎస్టీ వసూళ్లలో దుమ్మురేపిన ఏపీ.. సౌత్‌లోనే నంబర్ 1 స్టేట్‌గా రికార్డ్..

ఏపీలో జీఎస్టీ వసూళ్లు దుమ్మురేపాయి. రాష్ట్రంలో అభివృద్ధి ప్రగతి పథంలో దూసుకుపోతుంది అనడానికి జీఎస్టీ వసూళ్లే ప్రత్యక్ష ఉదహరణగా నిలుస్తున్నాయి.

Rashmika:రష్మిక మార్ఫింగ్‌ వీడియో వైరల్‌.. తీవ్రంగా స్పందించిన అమితాబ్ బచ్చన్..

'పుష్ప' సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా(Rashmika Mandanna)..  తాజాగా 'పుష్ప-2',

Jana Sena:జనసేనకు ఆ స్థానాలు కేటాయింపు వెనక బీజేపీ మాస్టర్ ప్లాన్..!

తెలంగాణలో గెలుపుకోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకోసం జనసేన పార్టీతో పొత్తుకు సిద్ధమైంది.