ఐదు రాష్ట్రాల్లో బాలయ్య బర్త్ డే కి ఏర్పాట్లు చేస్తున్న జగన్
- IndiaGlitz, [Tuesday,June 07 2016]
నందమూరి నట సింహం బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)ను ఐదు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఎన్.బి.కె హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అనంతపురం జగన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు...ఈ ఐదు రాష్ట్రాల్లోని బాలయ్య అభిమానులను సమీకరించి మొత్తం 56 లోకేషన్స్ లో బాలయ్య బర్త్ డే వేడుకలు ఘనంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
బాలకృష్ణ తన పుట్టినరోజును యుఎస్ఎ లోని అభిమానుల సమక్షంలో జరుపుకోనున్నారు. ప్రస్తుతం బాలయ్య క్రిష్ దర్శకత్వంలో వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి లో నటిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వందో చిత్రం చేస్తున్న సమయంలో వచ్చిన ఈ పుట్టినరోజు నాడు బాలయ్య గర్వపడేలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్.బి.కె హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అనంతపురం జగన్.