సీఎం జగన్ కీలక నిర్ణయం.. రూ. 7లక్షలు పరిహారం!

  • IndiaGlitz, [Wednesday,July 10 2019]

తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా రైతన్నల బతుకులు మాత్రం మారలేదని.. వారిని పట్టించుకునే నాధుడే లేడని పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లలో చదివే ఉంటారు.. టీవీల్లో చూసే ఉంటారు. మరీ ముఖ్యంగా అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే చివరికి గిట్టుబాటు ధరలేక.. చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోయి దిక్కుతోచక కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. వారంలో నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. ఇక ముందు రైతన్నల ఆత్మహత్యలు చేసుకున్నారన్న మాట వినకూడదని భావించిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

రూ.7లక్షలు పరిహారం!

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడమే కాదు.. వారికిస్తున్న పరిహారాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా ఒక చట్టాన్ని కూడా తీసుకు వస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో కలెక్టర్, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారు. 2014–2019 వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంపై అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

లెక్కలు తీయండి.. పరిహారం ఇవ్వండి!

డిస్ట్రిక్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రికార్డులు చెప్తున్నాయని.. కానీ 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టుగా రికార్డులు చెప్తున్నాయని వైయ‌స్‌ జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ రైతు కుటుంబాలకు పరిహారాన్ని నిరాకరించినట్టుగా దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. జిల్లాల్లో డేటాను పరిశీలించి.. ఎవరైనా అర్హులున్న రైతు కుటుంబాలు ఉంటే.. వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ఎక్కడైనా సరే... రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే.. వెంటనే కలెక్టర్‌ స్పందించాలని ఈ కాన్ఫరెన్స్‌లో జగన్ స్పష్టం చేశారు.

మానవత్వంతో మెలగాలని..!

కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం దగ్గరకు వెళ్లండని తెలిపారు. రైతులు కాని, కౌలు రైతులు కాని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కచ్చితంగా కలెక్టర్‌ ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని.. మళ్లీ సీఎం కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదన్నారు. మనది ప్రజల ప్రభుత్వమని, మానవత్వం ఉన్న ప్రభుత్వమని.. ఈ దిశగానే పాలన ఉంటుందన్నారు. చనిపోయిన వారి కుటుంబాల పట్ల సానుభూతితో ఉండాలని, మానవత్వంతో మెలగాలన్నారు. మనిషే చనిపోయాడు... మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాదని వైయ‌స్ జగన్ స్పష్టం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణయం ప‌ట్ల స‌ర్వత్రా హ‌ర్షం వ్యక్తమ‌వుతోంది.

More News

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు  సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా 'నేనే కేడీ నెం-1' ట్రైల‌ర్ లాంచ్‌!!

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం  `నేనే కేడీ నెం-1’.

ఆస్ట్రియా, కురేషియా లాంటి లోకేష‌న్స్ లో 'సాహో ' సాంగ్స్ పూర్తి

'బాహుబలి చిత్రం తరువాత  ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా  యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్  న‌టిస్తున్న సాహో

సిద్‌శ్రీరాం తొలి ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంటుందా?

సిద్ శ్రీరాం ప్ర‌ముఖ గాయ‌కుడిగా పేరు సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ పాట‌ల‌కు ఆయ‌న త‌న గాత్రంతో ప్రాణం పోశారు.

డైరెక్ట‌ర్ వ‌ద్ద‌న్నా న్యూడ్ సీన్ చేసిన అమ‌లాపాల్‌

రీసెంట్ టైమ్‌లో హీరోయిన్ అమ‌లాపాల్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. అందుకు కార‌ణం ఆమె న‌టించిన `ఆమె` (త‌మిళంలో అడై) సినిమానే.

'ఏయ్ జూనియర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

తెలంగాణా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి చేతులమీదుగా " ఏయ్ జూనియర్ " చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.