బాదుడే... బాదుడు.. జగన్ మార్క్ దోపిడీ: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్ల వర్షం కురిపించారు. ఇప్పటికే మద్యంపై భారీగా రేట్లు పెంచేసి దండుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ బిల్లుల పేరిట కొత్త దోపిడీకి తెరలేపిందని ట్విట్టర్ వేదికగా లోకేష్ మండిపడ్డారు.‘బాదుడే... బాదుడు... వైఎస్ జగన్ మార్క్ దోపిడీ. జగన్ విద్యుత్ బిల్లులు పెంచేసి విద్యుత్ వినియోగం తగ్గిస్తున్నారు.. అని వైకాపా నాయకులు దరువు వెయ్యడమే ఆలస్యం’ అని చినబాబు ట్వీట్ చేశారు. ఇందుకు ఓ వ్యక్తి ఇంటింటికి వెళ్లి మీటర్ పరిశీలించి బిల్లు ఇస్తున్న వీడియోను కూడా ఆయన జతచేశాడు. ఈ వీడియోలో ఉన్న విషయాలు చూస్తే కరెంట్ బిల్లులు చెల్లించాలనుకున్నవారికి ఎవరైనా షాకవుతారేమో.

మండిపడుతున్న జనం..

లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలలో బిల్లులు వేయలేదు కానీ యావరేజ్ మీదే చాలా మంది కట్టేస్తున్నారు. కొన్ని కొన్ని ఇళ్లకు భారీగానే కరెంట్ బిల్ వచ్చింది. దీంతో వినియోగదారులు ఆ బిల్స్ చూసి కంగుతింటున్నారు. ప్రభుత్వం ఎందుకిలా చేస్తోందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. యూనిట్స్ యూనిట్స్ అంటూ జగన్ సర్కార్ మమ్మల్ని దోచుకుంటోందంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అవసరమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసిస్తామని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను రీడింగ్ తీయకుండా సదరు రీడింగ్‌ను ఈ నెల అనగా మే లో తీసిన విషయం అందరికి తెలిసిందే.

More News

నేడు రెండో పెళ్లి చేసుకోనున్న నిర్మాత దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. నేడు అనగా ఆదివారం రాత్రి ఈ వివాహం జరగనుంది. ఈ వేడుకకు నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదిక కానుంది.

హైదరాబాదీలు తస్మాత్ జాగ్రత్త.. పోలీసుల ముందస్తు హెచ్చరిక

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఇప్పటికే మూడు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాయి. అయితే ఈ లాక్‌డౌన్‌తో ఎలాంటి కూలినాలీ లేక కార్మికులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు రావడం బాధాకరం!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బోన్ క్యాన్సర్‌ బాధపడుతున్నారని రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. అయితే ఈ వార్తల్లో ఏది నిజమో..

పుకార్లు నమ్మొద్దు.. నేను ఆరోగ్యంగానే ఉన్నా : అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. తనకోసం రంజాన్ మాసంలో ముస్లింలు అందరూ ప్రార్థన చేయాలని గత కొన్ని రెండ్రోజులుగా సోషల్ మీడియాలో..

మందుబాబులకు మరో షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ సర్కార్ వడివడిగా అడుగులేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ.. ముందుకు కదులుతున్న