Jagan:సీఎం జగన్.. చేసేవే చెబుతాడు.. చెప్పినవి చేస్తాడు..
- IndiaGlitz, [Saturday,April 27 2024]
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో మీద ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. చేయగలిగిన హామీలను మాత్రమే ఇచ్చారంటూ చర్చించుకుంటున్నారు. చంద్రబాబు మాదిరి మోసం మాటలు చెప్పలేదని పేర్కొంటున్నారు. జగన్ కానీ.. వాళ్ల తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ.. చెప్పేవే చేస్తారు..చేసేవే చెబుతారు తప్ప చంద్రబాబు మాదిరి నోటికొచ్చినవన్నీ చెప్పరంటున్నారు. అలా చెప్పి అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోను మాయం చేసే పనులు వారికి తెలియవు అంటున్నారు.
ఇదిగో ఇదీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... ఇవే మనం చేయగలం.. ఇవే చేస్తాం అని నమ్మకంగా చెప్పారంటున్నారు. మహిళలు, రైతులు, పేద తల్లులకు మరింత భరోసా కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. పెన్షనర్లకు రానున్న కాలంలో మరింత మేలు చేసేందుకు సిద్ధం అన్నారు. దీంతో విజ్ఞులైన ఏపీ ప్రజలు చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తారని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిందే చేస్తాం... చేయగలిగేది చేస్తాం.. అని బల్లగుద్ది చెప్పే జగన్‌ను విశ్వసిస్తామని స్పష్టంచేస్తున్నారు.
అందుకే మాట మీద నిలబడే రాజన్న కొడుకుగా జగన్‌కు సైతం ప్రజలు తమ మనస్సులో సుస్థిరమైన స్థానం కల్పించారు. ఈ క్రమంలో అయన విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా నమ్మకం కలిగించింది. ఈ నేపథ్యంలో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ప్రజలు ఇప్పటికే నమ్మకంగా చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ మ్యానిఫెస్టో సింపుల్‌గా స్పష్టంగా జనాల్లోకి బలంగా వెళ్లింది. ప్రస్తుతం ఇస్తున్న పథకాలనే సరిగ్గా అమలు చేస్తే చాలు అని ప్రజలు చర్చించుకోవడం జగన్ పట్ల వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.