ఘట్టమనేనికి 'కింగ్' రూపంలో జగన్ ఝలక్!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు ‘కింగ్’ రూపంలో వైఎస్ జగన్ సడన్ షాకివ్వబోతున్నారా..? ఏ సీటు అయితే ఆయన అడిగి ఇవ్వలేదని పార్టీని వీడారో.. అదే సీటును అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి ఇవ్వాలని వైసీపీ అధిపతి భావిస్తున్నారా..? వైఎస్ హయాం నుంచే రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్న అక్కినేని ఫ్యామిలీ ఈ సారి పక్కాగా వచ్చేస్తారా..? అంటే కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది.
ఘట్టమనేని పోతేనేం.. ‘కింగ్’ దొరికాడుగా!
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి - ఘట్టమనేని కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీలోనే కంటిన్యూ అవుతూ వస్తున్న ఆయన గుంటూరు నుంచి పోటీ చేయాలని భావించగా.. అధిష్టానం మాత్రం విజయవాడ నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని ఆదేశించింది. దీంతో అసంతృప్తికి లోనైన ఘట్టమనేని పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇటీవల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన సీటుపై హామీ ఇచ్చారా..? లేదా అనే విషయం భేటీ అయిన ఆ ఇద్దరికే ఎరుక!. దీంతో పార్టీని వీడిన ఆయనకు ఝలక్ ఇవ్వాలని జగన్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే సడన్‌గా ‘అక్కినేని ఫ్యామిలీ’ గుర్తుకు రావడంతో.. ఘట్టమనేనికి ‘కింగ్’ రూపంలో ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరూ సన్నిహితులే.. !
నాడు వైఎస్సార్‌తో ఘట్టమనేని.. అక్కినేని రెండు కుటుంబాలకు చాలా మంచి సాన్నిహిత్యం ఉండేది. వైఎస్ మరణాంతరం జగన్‌తో కూడా రెండు కుటుంబాలు మంచి పరిచయాలున్నాయి.. ఆప్తులు కూడా. అయితే సడన్‌గా ఘట్టమనేని ఫ్యామిలీ ఇవ్వడంతో ఆ స్థానంలోకి అక్కినేని ఫ్యామిలీని తీసుకురాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఎప్పట్నుంచో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కింగ్ నాగార్జునకు వైఎస్సార్ మరణంతో ఆ కోరిక నెరవేరలేదు. దీంతో తాజాగా నాగార్జునకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటిచ్చి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట.
పోటీ ఎక్కడ్నుంచి..!?
గుంటూరు నుంచి పోటీ చేయాలని అప్పట్లో నాగార్జున భావించారు.. అయితే అదే నియోజకవర్గాన్నే ఇవ్వాలని ఇప్పుడు జగన్ అనుకుంటున్నారట. అయితే ఇదే గుంటూరు నుంచి తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఘట్టమనేని ఆది డిమాండ్ చేసి.. ఇవ్వకపోవడంతో వైసీపీ వదిలారో.. అదే నియోజకవర్గం నుంచి కింగ్‌ను పోటీకి దింపి షాక్ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి ఘట్టమనేనికి గుంటూరు నుంచి ఇవ్వకపోతే.. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేసినా సరే నాగ్‌ను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది.
ఘట్టమనేని కుదరకపోతే గల్లాకే!
ఒక వేళ ఘట్టమనేనికి ఇవ్వని పరిస్థితుల్లో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్న ఆయన వియ్యంకుడు గల్లా జయదేవ్‌పై నిలబెట్టడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదట. దీంతో ఘట్టమనేని వర్సెస్ అక్కినేని అవుతుందేమో. అయితే సూపర్‌స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎటుంటారో..? ఎవరికి జై కొడతారో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ నాగార్జున ఒప్పుకోకపోతే అమలను బరిలోకి దింపేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ అక్కినేని వర్సెస్ ఘట్టమనేని వ్యవహారంపై క్లారిటీ రావాలంటే వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే ఎవరు నెగ్గుతారో..? అటు అక్కినేని.. ఇటు ఘట్టమనేని అభిమానులు ఎటు మొగ్గుచూపుతారో? వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout