Jagan:జనమే జగన్ బలం.. జగనే జనం బలం..

  • IndiaGlitz, [Thursday,November 16 2023]

ఆనాడు తండ్రిని చూడటానికి జనాలు తండోపతండాలుగా పోటెత్తేవారు.. ఈనాడు ఆయన కుమారుడిని కళ్లారా చూడటానికి ఉరకలేసే ఉత్సాహంతో పరిగెత్తుతున్నారు. ఇద్దరికి ప్రజలతోనే సంబంధం.. ప్రజలతోనే అనుబంధం.. అటు తండ్రికొడుకులకు జనాన్ని చూస్తే సమరోత్సాహం.. ఇటు జనానికి కూడా ఆ ఇద్దరిని చూస్తే ఆనందోత్సహం. వారు రోడ్డు పైకి వస్తే ఇసుక వేస్తే రాలనంత జనం.. ప్రతిపక్షాల గుండెల్లో ఓటమి భయం.

పల్నాడు జిల్లా మాచర్లలో వరికెపూడిసెల ప్రాజెక్ట్ శంకుస్థాపనకు హాజరైన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అశేష ప్రజానీకం అఖండ నీరాజనం పలికింది. అసలు ప్రజలెవరూ ఇళ్లలో లేరా..? అందరూ జగనన్నకు స్వాగతం పలికేందుకు వచ్చారా..? నేల ఈనిందా.. ఆకాశం ఆశీర్వదించిందా..? అన్నట్లు చిన్నాపెద్దా...ఆడా మగా లక్షలాదిగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. తమ అభిమాన నాయకుణ్ణి చూసేందుకు వచ్చిన కార్యకర్తలు కొందరైతే.. తమకు అన్నింటా అండగా నిలబడిన తమ్ముణ్ణి చూసేందుకు వచ్చిన ఆడబిడ్డలు మరికొందరు.. మేనమామ వచ్చాడు అనే ఆనందంతో పరుగెత్తుకు వచ్చిన విద్యార్థులు ఇంకొందరు.. దీంతో ఇటు పల్నాడు రోడ్లన్నీ బ్లాక్ అవ్వగా.. అటు ప్రతిపక్షాల మైండ్లు కూడా బ్లాక్ అయ్యాయి.

సీఎం జగన్ బయటికి వచ్చేవరకే ఎవరి ఆటలైనా.. మాటలైనా.. ఒక్కసారి ఆయన రోడ్డెక్కితే అసలు సీన్ మొత్తం అయన వైపే మారిపోతుంది. జగనన్న ప్రజల్లోకి వస్తే ఆ జన స్పందన వేరు. ఆయన తమ ప్రాంతానికి వస్తే గ్రామ, వార్డ్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు.. చిన్న కార్యకర్త మొదలు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి వరకూ అందరికీ పూనకాలు లోడింగ్. ఇక వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం కానీ పొంగిపొర్లితే అడ్డూ అదుపూ.. ఒడ్డూ గట్టూ తేడా లేకుండా సునామీ సృష్టిస్తుంది.

రానున్న ఎన్నికలకు ఇదే ఓ శాంపిల్ ప్రచార సభ మాదిరి మొదలైన మాచర్ల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్‌ను చిరుత పులుల మాదిరి ఉరకలేయించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ వంటి కీలక నాయకుల సభలు సైతం జనం రాక వెలవెలబోతున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన సాధికార బస్సు యాత్రకు సైతం జనం పోటెత్తుతున్నారు. ఆ పార్టీ సభలు, కార్యక్రమాలకు జగనన్నే రావక్కర్లేదు. ఆయన తరఫున ఆయన ఫ్లెక్సీ, కటౌట్ ఉన్నా సరిపోతుంది. అందుకే సాధికార యాత్రకు ప్రజలు పెద్దఎత్తున హాజరవుతున్నారు. ఇది చూసిన టీడీపీ, జనసేన నాయకుల్లో కలవరం మొదలైంది. తాము మనం ఇంతగా గొంతు చించుకుని అరుస్తున్నా ప్రజలు పట్టించుకోకుండా సీఎం వైయస్ జగన్ సభలకు పోటెత్తుతున్నారు అంటే ఇక రానున్న ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమనే ఆందోళన వారిలో దడపుట్టిస్తోంది.

More News

Balayya:బాలయ్యతో 'యానిమల్' వైల్డ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

'అన్‌స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలో ఏ టాక్‌ షోకు రాని రికార్డులు ఈ షోకు వచ్చాయి.

Nomination:ముగిసిన నామినేషన్ల ఘట్టం.. అత్యధికంగా ఎల్బీ నగర్‌లో 48 మంది పోటీ

నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు మిగిలారు.

Pawan Kalyan:పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్..!

పవర్ స్టార్ అభిమానులకు కొంత బ్యాడ్ న్యూస్ లాంటి వార్త ఇది. ఇటు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పవన్ బిజీగా ఉన్నారు.

Balakrishna:ఇక యుద్ధం మొదలైంది.. పవన్ కల్యాణ్‌పై బాలకృష్ణ ప్రశంసలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. తాను, పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడే మనుషులమని తెలిపారు.

Vijayashanthi:బీజేపీకి విజయశాంతి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ..?

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి భారీ షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా..