Mahasena Rajesh:పవన్ కంటే జగన్ బెటర్.. మహాసేన రాజేష్ యూటర్న్..

  • IndiaGlitz, [Tuesday,May 07 2024]

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా టీడీపీ నేత మహానేత రాజేష్ ఎన్డీఏ కూటమికి ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి 400 సీట్లు సాధించడానికి అవసరమైతే ప్రాణ త్యాగాలను చేస్తామంటూ పవన్ కల్యాణ్ చెప్పడాన్ని తప్పుపట్టారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హీరో లాంటి స్టేట్‌మెంట్ ఇచ్చారని ప్రశంసించారు.

'పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం.. పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది.. వీళ్ళిద్దరి కన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్.. కులం మతం పేరుతో అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే వారికీ వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు.. పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్ధాలు ప్రజలకు తెలియజేస్తాం.. ఇప్పటికే చాలా సహించాం.. జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లోను ఓడించడానికి రాజ్యాంగ బద్దంగా పనిచేస్తాం.. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు.. అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడటమే మాకు ఇష్టం.. పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్లం.. పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనపుడు మేము కూడా నిలకడగా ఉండలేము'అంటూ తెలిపారు.

కాగా మహాసేన రాజేష్ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేశారు. ఫలితాల అనంతరం జగన్ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ వీడియోలు చేసి పాపులర్ అయ్యాడు. అయితే ఆ తర్వాత జనసేన పార్టీకి దగ్గరయ్యారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే రాజేష్‌కు చంద్రబాబు పి.గన్నవరం సీటిచ్చారు. కానీ రాజేష్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ సీటు జనసేన పార్టీకి కేటాయించారు. అనంతరం మహాసేన రాజేష్‌ను టీడీపీ స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. అయితే రాజమహేంద్రవరంలో ప్రధాని మోదీ సభకు పవన్ కల్యాణ్‌ హాజరుకావడం.. మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

More News

Ambati Rambabu son-in-law:మరో వీడియో వదిలిన మంత్రి అంబటి రాంబాబు అల్లుడు

ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Committee Kurrollu:జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా  ‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి ‘గొర్రెలా..’ అనే పాట విడుదల

ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషిస్తున్నాయి.

Prime Minister Modi:హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార,

Chiranjeevi:పవన్ కల్యాణ్‌ను గెలిపించండి.. ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి సందేశం..

పోలింగ్‌కు ఐదు రోజులు ముందు ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఠాపురంలో

Chandrababu:పేదలపై మరోసారి చంద్రబాబు కుట్రలు.. పథకాలు అందకుండా ఈసీకి ఫిర్యాదు..

టీడీపీ అధినేత చంద్రబాబుకు పేదలంటే ఎందుకింత చులకనే అర్థం కావడం లేదు. తొలి నుంచి పేదలంటే ఆసహ్యించుకునే చంద్రబాబు ఎన్నికల