Pawan Kalyan:కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌కు లేదు.. పెడన వారాహి సభలో పవన్ విమర్శలు

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము సీఎం జగన్‌కు లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్.. వైసీపీ అధినేత జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. జగన్‌కు దమ్ముంటే రాజధాని కావాలని.. పోలవరం కావాలని.. నిధులు కావాలని కేంద్రాన్ని అడగాలన్నారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను అడిగానని.. 30 మంది ఎంపీలు ఉన్న జగన్ మాత్రం ఒక్క మాట కూడా అడగరన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేయాలని అడుగుతారని ఆరోపణలు చేశారు. అలాగే జగన్‌కు ఒంట్లో దమ్ము లేదని.. విభజన సమయంలో సోనియా గాంధీ ఎక్కడ చూస్తారని పార్లమెంట్‌లో ఓ చాటున ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు.

జగన్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి తరిమేయాలని ప్రజలకు పిలుపు..

పెడన సభ వేదికగా ప్రజలకు పిలుపునిస్తున్నా.. జగన్‌ను శాశ్వతంగా రాజకీయాల్లోకి రాకుండా రాష్ట్రం నుంచి తరిమేయాలని కోరారు. రాజకీయాలకు జగన్ అనర్హుడని.. జగన్‌పై 30కి పైగా కేసులు ఉన్నాయన్నారు. తనపై అన్ని కేసులు పెట్టుకుని అందరిపై కేసులు పెడతానేంటి ఎలా జగన్ అని ప్రశ్నించారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందని.. కానీ కొంతమంది వైసీపీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. జగన్ కరోనా మహమ్మారిలా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఏపీలో సభ పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలోకి రావాలంటే పాస్ పోర్ట్ చూపించాల్సిన పరిస్థితి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.

కొన్ని పాలసీల వరకే టీడీపీతో విభేదించా.. వచ్చేది జనసేన-తెలుగుదేశం ప్రభుత్వమే..

గతంలో టీడీపీతో కొన్ని పాలసీల వరకే విభేదించానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ-జనసేన కలిసి పనిచేయాలని క్యాడర్‌కు సూచించారు. వైసీపీని గద్దె దింపాలంటే ఓట్లు చిలకుండా అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికే నవరత్నాలు అని జగన్ మోసం చేశారని వెల్లడించారు. పెడనలో వైసీపీ దాష్టీకంపై జన సైనికులు పోరాటం చేశారని.. ఇక్కడ జనసైనికుల్ని కొట్టించిన వైసీపీ నేతల్ని తాను మర్చిపోనని హెచ్చరించారు.

More News

Chandra Babu:చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపసై విచారణను రేపటికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

Varalaxmi Sarathkumar:డ్రగ్స్ కేసులో నోటీసులంటూ ప్రచారం .. నా ఫోటోతో వార్తలు , ఏం జరిగిందంటే : క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మీ

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ తరంలోని అద్భుతమైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు.

Talasani Srinivas Yadav:చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

టీడీపీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు అరెస్టును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

Nobel Prize:రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు

2023 సంత్సరానికి గాను వివిధ విభాగాల్లో సోమవారం నుంచి నోబెల్ అవార్డులు ప్రకటిస్తున్న రాయల్ స్వీడిష్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఇవాళ(బుధవారం)

Devara:జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. దేవర గురించి సూపర్ అప్టేడ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుకు అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ.