'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా, శ్రీదేవి హీరోయిన్‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’. ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం విడుద‌లై మూడు ద‌శాబ్దాలైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా నిర్మాత, వైజ‌యంతీ మూవీస్ అధినేత సి.అశ్వ‌నీద‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారు న‌టించిన జ‌గ‌దేక‌వీరుడు వంటి సినిమాను తీయాలనుకున్నాను. ఈ ప్ర‌యాణంలో నా క‌ల జగ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి సినిమాతో నిజ‌మైంది. ఈ ముప్పైఏళ్లే కాదు.. మ‌రో ముప్పై ఏళ్లు మాట్లాడుకునే సినిమా ఇది’’ అన్నారు.

అశ్వనీదత్ జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ గురించి కూడా ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. ‘‘క‌చ్చితంగా మా జ‌గ‌దేక‌వీరుడు మ‌ళ్లీ వ‌స్తాడు. రెండో భాగం కూడా ఉంది. ఎవ‌రు న‌టిస్తారు? ఎప్పుడు చేస్తాం? అనే వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలిజ‌యేస్తాను’’ అన్నారు. వైజయంతీ మూవీస్ అనుబంధ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్‌లో హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా ఓ సినిమా ఉంటుంది. దీంతో పాటు నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంది. దీంతో పాటు మ‌రో క‌థ‌ల‌ను త‌యారు చేస్తున్నామ‌ని అశ్వ‌నీద‌త్ తెలిపారు.

More News

మెగా ఫ్యాన్స్ కోరిక నేర‌వేరేనా?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు రెండు పెద్ద కోరిక‌లు మిగిలిపోయాయి. అవేంటంటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించ‌డం, మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం.. జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇవాళ తెల్లారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ లీకయ్యింది.

మద్యం అమ్మకాల్లో ఆంధ్రా రికార్డ్ బద్ధలు కొట్టిన తెలంగాణ!

లాక్ డౌన్ 3.0 విధించిన అనంతరం కేంద్రం కొన్ని సడలింపులు చేసిన విషయం విదితమే. ఇందులో మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో

ఏపీ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లోని పాలనా యంత్రాంగంలో కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టూరు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని సీఎంగా

మ‌రోసారి పాక‌శాస్త్రంలో మోహ‌న్‌బాబు ప్రావీణ్య‌త‌

కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల లాక్‌డౌన్‌ను విధించాయి ప్ర‌భుత్వాలు. దీంతో సినీ సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. షూటింగ్స్ అన్నీ ర‌ద్ద‌యిపోవ‌డంతో ఎప్పుడూ షూటింగ్స్,