బిగ్‌బాస్ హౌస్‌లో ఎఫ్2.. జాఫర్-భాస్కర్ అదుర్స్!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ హౌస్ రోజు రోజుకు మంచి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఇందుకు కారణం హౌస్‌లో సిల్లీ పనులు, కామెడీలు, అప్పుడు సీరియస్‌గా వీరలెవల్లో డైలాగ్స్, కోపతాపాలే. ఏమీ జరగకపోయినా.. ఏదేదో జరిగిపోయినట్లు సీరియల్స్ కంటే దారుణంగా ప్రోమోస్‌ను రిలీజ్ చేస్తూ జనాల దృష్టిని బాగా ఆకర్షించి ‘మా’ టీవీ పెట్టి చూసేట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇక శుక్రవారం జరిగిన ఎపిసోడ్ విషయానికొస్తే.. కొరియోగ్రాఫర్- జాఫర్లు ఇద్దరూ హిట్టయ్యారని చెప్పుకోవచ్చు.
హమ్మయ్యా రిలీఫ్..!
వీరిద్దరూ కామెడీ కమ్ సీరియస్‌నెస్‌ను పండించడంలో సక్సెస్ అయ్యారు. కాసేపు గొడవ పడటం.. మరికాసేపు నవ్వుకుని ఫ్రెండ్లీ అయిపోవడం చూసి మిగతా కంటెస్టెంట్లు సైతం కుళ్లుకుంటున్నారట. కాగా సిల్లీ పనులు.. అలక, గొడవలతో ఇంట్రెస్ట్ మొత్తం పోయినప్పటికీ.. జాఫర్-భాస్కర్ల కామెడీ, డైరెక్షన్ చేయడం, వ్యాయామం కాసింత రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఎఫ్-2’ సినిమాను ఈ ఇద్దరూ ఫాలో అయిపోతున్నారనుకోవచ్చు. కాసేపు కామెడీ.. మరికాసేపు ఫ్రస్టేషన్ ఇద్దరూ ‘రా’ అనుకోవడం.. మళ్లీ సారీ చెప్పుకొని ఒక్కట్టవ్వడం ఫన్నీగా ఉంది.
జాఫర్-భాస్కర్ మధ్య అసలేం జరిగింది!!
బిగ్‌బాస్ టాస్క్ మేరకు కంటెస్టెంట్స్ అందరూ రెండు టీమ్‌లుగా విడిపోతారు. ఆర్ట్స్ స్కూల్‌గా విభజించి ఒకదానికి శ్రీముఖిని.. మరొక దానికి బాబా భాస్కర్‌ను లీడర్‌గా నియమించాడు. వీరంతా మంచి కాన్సెప్ట్స్‌తో ఆడుతూ, పాడుతూ బిగ్‌బాస్‌ను ఎంటర్టైన్ చేయడమే టాస్క్. ఇందుకు కసరత్త చేస్తుండగా భాస్కర్- జాఫర్లు చేసిన కామెడీ.. ఈ హడావుడిలో కాసింత బాగానే ఉంది. చిన్న చిన్నవాటికి గొడవలు పెట్టుకోవడం మళ్లీ కొద్దిసేపటికే నవ్వుకోవడం అంటూ జాఫర్ కామెంట్ చేయడం, చివరగా.. జాఫర్‌ను ‘రా’ అని అమర్యాదగా సంభోదించడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావ్..? అని ఆయన సీరియస్ కావడం ఈ షోకు హైలెట్‌గా నిలిచాయి. మరోవైపు.. శ్రీముఖి టీమ్ చేసిన స్కిట్ ఫన్నీగా ఉండటం.. బాబా భాస్కర్ టీమ్ చేసిన స్కిట్ కాస్త ఎమోషనల్ టచ్‌గా ఉండటంతో ఈ ఎపిసోడ్ ఎక్కడికో వెళ్లిపోయింది. శనివారం వస్తున్న కింగ్ నాగార్జున ఈ వ్యవహారంపై ఏం మాట్లాడుతారో..? ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout