అక్టోబ‌ర్ 13న జాకీచాన్ 'ది ఫారిన‌ర్' విడుదల

  • IndiaGlitz, [Wednesday,October 04 2017]

జాకీ చాన్ తాజాగా న‌టించిన చిత్రం 'ది ఫారిన‌ర్‌'. మార్టిన్ కాంపెబెల్ ద‌ర్శ‌కుడు.1992లో స్టీఫెన్ లీథ‌ర్ ర‌చించిన 'ద చైనామ్యాన్‌' న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో అక్టోబ‌ర్ 13న అత్య‌ధిక థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. ఖాసీం, ఎమ్. రాజశేఖర్ రెడ్డి సమర్పణలో, నక్షత్ర మీడియా బేన‌ర్ పై నక్షత్ర రాజశేఖర్ సౌత్ ఇండియాలోని అన్ని భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ.. జాకీ చాన్ న‌టించ‌గా భారీ బ‌డ్జెట్ తో రూపొందిన చిత్ర‌మిది. లండ‌న్ లో హంబుల్ బిజినెస్ మేన్ గా ఎంతో మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్న హీరో ఉగ్ర‌వాదుల దాడుల్లో త‌న కూతురు చ‌నిపోవ‌డంతో దీనికి కార‌ణ‌మైన వారంద‌రినీ టార్గెట్ చేసి త‌న రివేంజ్ తీర్చుకోవ‌డ‌మే సినిమా. ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం జాకీ చాన్ చిత్రాల త‌ర‌హాలో ఉంటూ ఆద్యంతం అల‌రిస్తుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్, రిస్కీ ఫైట్స్ ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటాయి. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లో అక్టోబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాం..అన్నారు.

బ్యానర్: నక్షత్ర మీడియా, సమర్పణ: ఖాసీం, ఎమ్. రాజశేఖర్ రెడ్డి, నిర్మాత: నక్షత్ర రాజశేఖర్, దర్శకత్వం: మార్టిన్ కాంపెబెల్

More News

వ‌ర్మ‌తో నాగ్‌...

శివ అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేర్లు రాంగోపాల్ వ‌ర్మ‌, అక్కినేని నాగార్జున‌. 26 ఏళ్ల క్రితం విడుద‌లైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మార్చేసింది. నాగార్జున‌ను స్టార్‌ను చేసేసింది.

క‌మ‌ల్ స్థానంలో సూర్య‌....ఎన్టీఆర్ స్థానంలో...

ఉత్త‌రాదిన క‌మ‌ల్ హాస‌న్‌, ద‌క్షిణాదిన ఎన్టీఆర్ హోస్ట్‌లుగా ప్రారంభ‌మైన రియాలిటీ షో బిగ్ బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ పూర్త‌య్యింది. మ‌రి సెకండ్ సీజ‌న్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో వ‌చ్చే ఏడాది ఈ బిగ్‌బాస్ సెకండ్ సీజ‌న్ ప్రారంభమ‌వుతుంద‌ని స‌మాచారం.

రీమేక్‌లో సునీల్ చేయ‌డం లేదా?

త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించిన చతురంగ వేట్టై అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ హీరోగా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో సునీల్ న‌టించ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

చ‌ర‌ణ్‌తో స్పెష‌ల్ సాంగ్ బ‌న్ని హీరోయిన్‌...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలో బ‌న్నితో ఆడి పాడిన పూజా హెగ్డే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చేయ‌నుండ‌టం విశేషం.

ప‌వ‌న్ 25..మూడు హ్యాట్రిక్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాల త‌రువాత మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని సం