జాకీచాన్ విడుదల చేసిన 'అభినేత్రి' హిందీ పోస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తెరకెక్కించిన కామెడి, హర్రర్ థ్రిల్లర్ `అభినేత్రి`. తెలుగులో ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్, బ్లూ సర్కిల్ కార్పోరేషన్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 70 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది.
సినిమాను సెప్టెంబర్ 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా హిందీలో శక్తిసాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోనూసూద్ నిర్మాతగా `2 ఇన్ 1` అనే టైటిల్‌తో విడుదల అవుతుంది.సోనూసూద్ పుట్టినరోజు సందర్భంగా హాలీవుడ్ యాక్టర్ జాకీచాన్ చేతుల మీదుగా ఈ సినిమా పోస్టర్ విడుదలైంది. తన తండ్రి భౌతికంగా లేకపోయినా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ తనతోనే ఉంటాయని ఈ సందర్భంగా సోనూసూద్ తెలియజేశాడు. రీసెంట్గా సోనూసూద్, జాకీచాన్ కలిసి ఓ హాలీవుడ్ చిత్రంలో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com