ఆ ముగ్గురి వల్ల నా ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యాం .. జబర్దస్త్ వర్ష ఏమోషనల్ పోస్ట్

  • IndiaGlitz, [Monday,January 24 2022]

క్యూట్ లుక్స్‌, వైట్ స్కిన్ టోన్‌తో కామెడీ షో జబర్దస్త్‌‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వర్ష. యాంకర్లు అనసూయ, రష్మీల తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈవెంట్లతో వర్ష దూసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాలని ప్లాన్ చేసుకుంటోంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు వర్ష. అంతేనా తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది. అయితే తాజాగా వర్ష పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ చేదు ఘటన గురించి చెబుతూ తన బాధను అందరితో పంచుకుంది. అదేంటంటే ఆమె సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన వర్ష.. హాస్పిటల్ బెడ్‌పై రక్తం కారుతూ తన సోదరుడు తీసుకుంటున్న ట్రీట్‌మెంట్ ఫొటోలను పోస్ట్ చేశారు.

అంతేకాదు.. డ్రైవింగ్ చేసేటపుడు చాలా అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరింది. ఓ ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల తన సోదరుడు ప్రమాదానికి గురయ్యాడని తెలిపింది. ప్రస్తుతం అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడని.. కానీ తన ఫ్యామిలీ అంతా చాలా బాధపడ్డామని వర్ష ఆవేదన వ్యక్తం చేసింది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉంటే ఏ ఫ్యామిలీ కూడా బాధ పడకుండా ఉండొచ్చని హితవు పలికింది.