Rocking Rakesh- Sujatha:ఒక్కటైన 'రాకేష్-సుజాత' . తరలివచ్చిన జబర్దస్త్ స్టార్స్, ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాతలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో వున్న ఈ జంట ఇటీవలే గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు తిరుపతిలో సుజాత-రాకేష్‌ల పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. మంత్రి రోజా దంపతులు కూడా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
చిన్నారులతో స్కిట్లు కొట్టిన రాకేష్:
ఇదిలావుండగా.. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రాకేష్.. పలు ఈవెంట్లు చేసి పాపులర్ అయ్యాడు. అలా అతనికి జబర్దస్త్‌లో అవకాశం దక్కింది. దీంతో రాకేశ్ వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తొలుత ధనరాజ్ టీమ్‌లో తర్వాత కిరాక్ ఆర్పీ టీమ్‌లో పనిచేసిన రాకేష్ అనంతర కాలంలో టీమ్ లీడర్‌గా మారాడు. అంతా పెద్దలతో స్కిట్లు చేస్తుంటే.. ఇతను మాత్రం చిన్నపిల్లలతో స్కిట్లు చేసి సక్సెస్ కొట్టేవాడు. అలా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన సుజాత:
ఇక సుజాత విషయానికి వస్తే.. సుజాత తొలుత ఓ ప్రముఖ తెలుగు ఛానెల్లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు. అనంతరకాలంలో బిగ్‌బాస్‌లో అవకాశం రావడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. పలు టీవీ ప్రోగ్రామ్‌లు చేస్తుండగా.. గతంలో రాకేష్‌తో వున్న పరిచయంతో జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఇద్దరూ కలిసి స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. తామిద్దరం ప్రేమలో వున్నట్లు జబర్దస్త్ వేదికపైనే ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే జబర్దస్త్‌లో ఇలాంటి జంటలు ఎంతోమంది వుండటంతో ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ రాను రాను ఇద్దరి విషయంపై జనానికి క్లారిటీ వచ్చేసింది. అలాగే ఎంగేజ్మెంట్, పెళ్లికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments