Ram Prasad: మెడికల్ క్యాప్‌తో ఆటో రామ్‌ప్రసాద్, క్యాన్సర్ అంటూ ప్రచారం.. స్పందించిన జబర్దస్త్ కమెడియన్
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్దస్త్.. ఈ షో గురించి తెలుగు నాట తెలియని వారుండరు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఇంటిల్లిపాదిని నవ్వించే ఈ ప్రోగ్రామ్ కోసం తెలుగువారు ఆతృతగా ఎదురుచూస్తారు. పదేళ్లు గడుస్తున్నా జబర్దస్త్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పించి.. వారు జీవితంలో మరింత స్థిరపడేందుకు అవకాశం కల్పించింది ఈ షో. తిరుగులేని టీఆర్పీతో తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో సత్తా చాటింది జబర్దస్త్. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు జబర్దస్త్ మునుపటి స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోతోంది. పాత వారు సినిమాలు, ఇతర టీవీ ఛానెల్స్‌లో అవకాశాలు రావడంతో జబర్దస్త్‌ను వీడారు. కొత్త వారు వస్తున్నా గతంలో మాదిరిగా రక్తి కట్టించలేకపోతున్నారు.
మెడికల్ క్యాప్‌తో ఆటో రామ్‌ప్రసాద్:
ఇదిలావుండగా.. జబర్దస్త్ నటీనటుల గురించి సోషల్ మీడియాలో , మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మేల్ కంటెస్టెంట్స్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య రిలేషన్ వుందని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటున్నారని పుకార్లు షికారు చేస్తుంటాయి. ఇక వీరి అనారోగ్యం గురించి కూడా వార్తలు హల్చల్ చేస్తూ వుంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఆటో రామ్ ప్రసాద్ కూడా చేరారు. ఆటోపంచ్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇతనికి జబర్దస్త్‌లో సెపరేట్ ఫ్యాన్స్ వున్నారు. తర్వాతి కాలంలో ఇతనినే ఫాలో అవుతూ కొందరు పంచ్‌లు క్రియేట్ చేసినప్పటికీ అవి రామ్‌ప్రసాద్ స్థాయిలో పండటం లేదు. తన ప్రాణమిత్రులు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్‌లు జబర్దస్త్‌ను వీడినా తను మాత్రం కంటిన్యూ అయ్యారు. మధ్యలో సినిమా అవకాశాలు కూడా అందుకుంటూ దూసుకెళ్తున్నాడు రామ్‌ప్రసాద్.
తన హెల్త్‌పై స్పందించిన రామ్‌ప్రసాద్:
అయితే కొద్దిరోజుల క్రితం ఇతను ఓ మెడికల్ క్యాప్ పెట్టుకుని, గడ్డంతో , సుధీర్ హగ్ చేసుకుని వున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రామ్‌ప్రసాద్‌కు క్యాన్సర్ వచ్చిందని, మరేదో వ్యాధి బారినపడ్డాడని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌ప్రసాద్ స్పందించారు. సోషల్ మీడియాలో తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారం ఎంతో బాధించిందన్నారు. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక మెడికల్ క్యాప్‌కు సంబంధించిన ఫోటోపైనా రామ్‌ప్రసాద్ స్పందించారు. అతి తాను హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నప్పటి ఫోటో అని స్పష్టం చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments