షాకింగ్: వ్యభిచారం గృహంలో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు పేరుగాంచిన ప్రముఖ జబర్దస్త్ షోకు చెందిన ఇద్దరు నటులు వ్యభిచార గృహంలో పట్టుబడటం షాక్‌కు గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే.. ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు జబర్దస్త్ కామెడీ షోకి చెందిన దొరబాబు, పరదేశీలను పోలీసులు పట్టుకున్నారు. వీరితో పాటు ఒక మహిళ, నలుగురు విటులను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలోని మాధవధారలో ఒక అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే టీమ్‌ను పంపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వెల్లడించారు. ఒక మహిళతో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకుని పీఎస్‌లో ఉంచినట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరున్నారు..? ఈ తంతు ఎప్పట్నుంచి నడుస్తోంది..? దీని వెనుక ముఠా ఏమైనా ఉందా..? అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. కాగా.. దొరబాబు, పరదేశీ ఇద్దరూ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి చిల్లర పనులతో పరువు పొగొట్టుకున్నారు. ఈ ఇద్దరు నటులు హైపర్ ఆది టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇక నుంచి వీరిద్దరూ జబర్దస్త్‌లో కూడా కనిపించడం కష్టమనేనని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com