‘జాను’ హిట్.. కాలినడకన తిరుమలకు చిత్రబృందం

  • IndiaGlitz, [Sunday,February 09 2020]

యంగ్ హీరో శర్వానంద్, సమంత నటీనటులుగా సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన రీమేక్ చిత్రం ‘జాను’. జనవరి-07న రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు కలెక్షన్ల పరంగానూ గట్టిగానే సంపాదించి పెట్టింది. మరీ ముఖ్యంగా విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషమని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన జనాలంతా సామ్ ఇరగదీసిందంతే అంటూ కితాబిచ్చేస్తున్నారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఆదివారం నాడు చిత్ర బృందం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామివారిని చిత్రబృందం దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత నిర్మాత దిల్ రాజు, సమంత, శర్వానంద్‌తో పలువురు చిత్రసభ్యులు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ, తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హిట్ కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. మా ఈ ‘జాను’ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని.. సినిమాలో శర్వానంద్, సమంత అద్భుతంగా నటించారన్నారు. కాగా దిల్‌రాజు తన తదుపరి చిత్రం ‘పింక్’ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.

More News

పవన్ ఫ్యాన్స్‌కు దిల్‌రాజు తియ్యటి శుభవార్త..

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండేళ్ల తర్వాత ముఖానికి రంగేసుకున్న సంగతి తెలిసిందే. ‘పింక్’ రీమేక్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆయనపై దర్శకనిర్మాతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

శ్రీరాముడిపై ‘కత్తి’ అనుచిత వ్యాఖ్యలు.. మళ్లీ బహిష్కరణ తప్పదా!!

సినీ క్రిటిక్ కత్తి మహేశ్ గురించి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. రోజుకు మూడు వివాదాలు.. ఆరు తిట్లు ఇదే జీవితంగా బతికేస్తుంటాడు.! అంతేకాదు సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవర్నీ వదలకుండా తనదైన శైలిలో

ర‌జినీ పొలిటిక‌ల్ పార్టీకి ముహూర్తం కుదిరింది!

త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాల నుండి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌బోతున్నారనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ర‌జినీకాంత్ తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్పారు కానీ..

నూర్ కుటుంబానికి చెర్రీ 10 లక్షల ఆర్థిక సాయం.. భరోసా

మెగాహీరోలను.. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణంగా అభిమానించే హైదరాబాద్‌కు చెందిన వీరాభిమాని నూర్ మహ్మద్ డిసెంబర్-8న మృతి చెందిన విషయం తెలిసిందే. సిటీ చిరంజీవి

‘కేజ్రీ’కే ఢిల్లీ కిరీటం.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకూ 58 శాతం పోలింగ్‌ నమోదయ్యింది.