త‌న క‌ల నెరవేరుతుంది అంటూ ఆనందంలో జానీ మాస్ట‌ర్..!

  • IndiaGlitz, [Friday,November 11 2016]

జానీ మాస్ట‌ర్ త‌న క‌ల నెర‌వెరుతుంది అంటూ చాలా చాలా ఆనందంలో ఉన్నారు. ఇంత‌కీ...జానీ మాస్ట‌ర్ క‌ల ఏమిటంటే...మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ అందించ‌డం. అది చిరంజీవి - వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఖైదీ నెంబ‌ర్ 150 లోని సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ అందిస్తుండ‌డం ద్వారా నెర‌వేరుతుంది.

ఈ విష‌యాన్ని జానీ మాస్ట‌ర్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ....చిరంజీవి గారి స్టెప్స్ చూస్తూ పెరిగాను. చిరంజీవి గారికి కొరియోగ్ర‌ఫీ అందించ‌డం అనేది నా క‌ల‌. అది ఇప్పుడు నెర‌వేరుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే చిరంజీవి గారికి ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేయాలి అనే భ‌యం కూడా ఉంది. లైఫ్ లో ఫ‌స్ట్ టైమ్ భ‌య‌ప‌డుతున్నాను అంటూ తన ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నారు. చిరంజీవి, కాజ‌ల్ పై సాంగ్ ను స్లోవేనియాలో చిత్రీక‌రిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు.

More News

నాని నేను లోక‌ల్ సింగిల్ షాట్ టీజ‌ర్ రిలీజ్..!

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కిస్తున్నారు.

బాహుబ‌లి నిర్మాతల‌ ఇళ్లు, ఆఫీస్ ల‌ పై ఐటి దాడులు..!

500, 1000 నోట్ల ర‌ద్దుతో టాలీవుడ్ కి ఓ షాక్ త‌గిలితే...ఇప్పుడు బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ పై ఐటి దాడుల‌తో మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం బాహుబ‌లి.

చందు మొండేటి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

కార్తికేయ‌, ప్రేమ‌మ్ చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి. త‌దుప‌రి చిత్రాన్ని చందు ఏ హీరోతో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే...చందు నెక్ట్స్ మూవీ హీరో అంటూ వ‌రుణ్ తేజ్, ర‌వితేజ‌, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి.

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ & ఆడియో రిలీజ్ డీటైల్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నారు.

500, 1000 నోట్ల రద్దు పై స్పందించిన మహేష్..!

భారత ప్రధాని నరేంద్రమోడీ 500,1000నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.