ఉగాది రోజున జె.డి.చక్రవర్తి - అమ్మ రాజశేఖర్ 'ఉగ్రం' ఫస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో 'నక్షత్ర' రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'ఉగ్రం'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినాన ఉగ్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సమ్మర్ కానుకగా చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ.. "ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన జెడి చక్రవర్తి మరో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ఉగ్రం. జె.డి.చక్రవర్తి కెరీర్లో ఉగ్రం ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని ధీమాగా చెప్పగలం. యూత్ ని విపరీతం గా ఆకట్టుకునే చిత్రం గా మా ఉగ్రం వుండబోతుంది. అలానే మాస్ ఇమేజ్ వున్న దర్శకుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథకు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి ఆయన నటించిన చిత్రమిది. యాక్షన్‌కు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది.
ఉగాదికి 'ఉగ్రం' ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నాం. ఉగ్రం మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మా దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రంగా ఉగ్రం తప్పకుండా నిలుస్తుంది. దర్శకుడు ఊహకి మా సినిమాటోగ్రాఫర్స్ అంజి, ఎస్ ముజీర్ మాలిక్ లు ప్రాణం పోసారు. కమర్షయల్ చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకి మా చిత్రం ఫీస్ట్ లా వుండబోతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాము" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com