హోప్ ఇస్తున్న జె అండ్ జె కోవిడ్ వ్యాక్సిన్.. కేవలం సింగిల్ డోస్ లోనే..
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికాలోని అగ్రగామి మెడికల్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తీపి కబురు చెప్పింది. కరోనా వైరస్ ప్రపంచానికి పెను శాపంగా మారింది. ప్రభుత్వాలు, వైద్య నిపుణులు ఎంత ప్రయత్నిస్తున్నా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కావడం లేదు. అనేక వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ కరోనా వేరియంట్లు మారుతుండడంతో వ్యాక్సిన్ల సమర్థతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
డెల్టా వేరియంట్ ప్రస్తుతం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్ ని ఎదుర్కొనలేకపోతున్నాయానే వార్తలు వస్తున్నాయి. ఇకపై కరోనా మరింత ప్రమాదకర వేరియంట్లుగా మారితే పరిస్థితి ఏంటి అనే అనుమానాలు లేకపోలేదు.
ఇదీ చదవండి: న్యూడ్ పార్టీలు, సెక్సువల్ రిలేషన్ షిప్స్.. బిల్ గేట్స్ అసలు రంగు ఇదే!
ఈ తరుణంలో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటన ఆసక్తిగా మారింది. డెల్టా వేరియంట్ పై పోరాడేందుకు ఓ హోప్ ఇచ్చింది. ఆ సంస్థ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో ఉంది.
క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కొంతమందిపై చేసిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ సమర్థవంతగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం సింగిల్ డోస్ వ్యాక్సిన్ మాత్రమే కోవిడ్ అన్ని వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు జె అండ్ జె గ్లోబల్ హెడ్ జాన్ వాన్ హోప్ గురువారం తెలిపారు.
రానున్న రోజుల్లో అమెరికాలో డెల్టా వేరియంట్ ప్రమాదకరంగా మారనుంది. ఇలాంటి తరుణంలో జె అండ్ జె ప్రయోగాలు పరిశీలించాక ఈ వ్యాక్సిన్ చాలా తక్కువగా యాంటీ బోడీలు తయారు చేస్తోందని అంచనాకు వచ్చారు. డెల్టాని ఎదుర్కొనేందుకు దీని సామర్థ్యం సరిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ తాజాగా తమ వ్యాక్సిన్ పట్ల సంతోషంగా ఉన్నట్లు జాన్ వాన్ హోప్ అన్నారు. అన్ని వేరియంట్లపై తమ వ్యాక్సిన్ ఎక్కువస్థాయిలో యాంటీ బాడీలు తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ కి ఇక బూస్టర్ అవసరం లేదు. డెల్టాని కూడా తొలి షాట్ లోనే ఎదుర్కోగలుగుతోంది. డెల్టా వేరియంట్ ని కేవలం 29 రోజుల్లోనే తమ వ్యాక్సిన్ న్యూట్రలైజ్ చేస్తోంది అని జాన్ వాన్ అన్నారు.
తదుపరి ప్రయోగ వివరాలని ఆగష్టు చివరికల్లా వెల్లడిస్తామని జాన్ వాన్ అన్నారు. అప్పటికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చి ప్రయోగాలు చేస్తామని చెప్పారు. సెకండ్ డోస్ తో శరీరంలో అత్యధిక స్థాయిలో యాంటీ బాడీలు తయారవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com