ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఇవాంక : మోదీ

సబర్మతీ ఆశ్రమం సందర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మెలానియా గుజరాత్‌లోని మెతెరా స్టేడియం చేరుకున్నారు. అక్కడ జరగుతున్న ‘నమస్తే ట్రంప్’ పాల్గొన్నారు. మొదట మోదీ మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రంప్‌ కూడా ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మోదీ ఏం మాట్లాడారు..!?
‘నమస్తే ట్రంప్’ అంటూ మూడుసార్లు పలుకుతూ మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాస్వామ్య దేశంలో మీకు ఘన స్వాగతం అంటూ స్వాగతించారు. ‘గుజరాత్‌ మాత్రమే కాదు యావత్ దేశం ట్రంప్‌కు స్వాగతం పలుకుతోంది. అహ్మాదాబాద్‌లోని ఈ స్టేడియం నవచరిత్రకు నాంది పలుకుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. హ్యూస్టన్‌లో హౌడీ-మోదీ కార్యక్రమంలో నాంది పలికింది. హౌడీ-మోదీ కొనసాగింపుగానే 'నమస్తే ట్రంప్' జరుగుతుంది. భారత్ అమెరికా సంబంధం కలకం వర్దిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది కొత్త చరిత్రకు శ్రీకారం. అప్పుడు హౌడీ మోదీ... ఇప్పుడు నమస్తే ట్రంప్. ట్రంప్ పాలనలో భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడ్డాయి. ట్రంప్ కుటుంబానికి మా తరపున అభినందనలు. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. సమాజంలో పిల్లల కోసం మెలానియా ట్రంప్ ఎంతగానే పాటుపడుతున్నారు’ అని మోదీ చెప్పుకొచ్చారు.

మాట నిలబెట్టుకున్న ఇవాంక!
ఈ సందర్భంగా భారత్‌లో మరోసారి పర్యటించిన ఇవాంకకు కూడా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి భారత్ వస్తానని ఇవాంక ట్రంప్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని మోదీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మరోసారి ఇవాంక ట్రంప్, ఆమె భర్తకు కూడా పేరుపేరున ప్రస్తావిస్తూ మోదీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. 2017లో హైదరాబాద్‌లో ‘గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్ సమ్మిట్‌’‌కు ఇవాంక హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఇవాంక ఆసక్తికర ట్వీట్!
ఇవాళ ఇండియా పర్యటనకు ముందు ఇదే విషయాన్ని ఇవాంక ట్రంప్ మరోసారి గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుయర్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పాల్గొన్నా. ఆ తర్వాత మళ్లీ మోదీని కలుస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య స్నేహాన్ని వేడుక చేసుకోడానికి ఇండియాకు తిరిగి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అని ఇవాంక ఆసక్తికర ట్వీట్ చేశారు.

More News

వెంకన్న సన్నిధిలో పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

‘సరస సంభాషణ’ దెబ్బకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.

శ్రీకాళహస్తీశ్వరునికి  పురాణపండ ' శివోహమ్' ను  సమర్పించిన ఎమ్మెల్యే రోజా

పంచ మహాపాతకాల్ని భస్మం చేసి, పరమపుణ్యాలను ప్రసాదించే రుద్ర  నమక చమక శక్తుల రహస్య విశేషాలతో పాటు సుమారు నలభై మూడు అపురూప శివ కవచ, స్తోత్ర, వ్యాఖ్యాన

నితిన్ రీమేక్‌లో అన‌సూయ‌?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

దర్శకులు అందరికీ 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' అంకితం! - బాలు అడుసుమిల్లి

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా

రాజమౌళికి షాకిచ్చిన గూగుల్

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అంటే ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో తెలియ‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.