ఎ.ఆర్.రెహమాన్... ఏం చెప్పారంటే...
- IndiaGlitz, [Monday,June 03 2019]
సొసైటీలో తమకు సంబంధించి ఏ విషయం గురించైనా ధైర్యంగా తమ వాణిని వినిపించడంలో ముందుంటారు తమిళ తంబిలు. తాజాగా హిందీ భాషను బోధించడం గురించి రెహమాన్ ట్విట్టర్ వేదికగా గళాన్ని వినిపించారు. 'అందమైన తీర్పు. హిందీని కచ్చితంగా చదవాల్సిన అవసరం లేదు. డ్రాఫ్ట్ ను మార్చారు' అని ఆయన ట్వీట్ చేశారు. ముందు హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ ఒక్కసారిగా తమ రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరిగా బోధించడానికి తమిళనాడు వంటి రాష్ట్రాలు అయిష్టతను వ్యక్తం చేశాయి. జనాల అభీష్టం మేరకు వారికి నచ్చితేనే నేర్చుకోవచ్చని కేంద్రప్రభుత్వం డ్రాఫ్ట్ చేసింది. ఈ సందర్భంగా రెహమాన్ చేసిన ట్వీట్ ఆయనకున్న మాతృభాషాభిమానానికి నిదర్శనం. దాంతో పాటు తాను స్వరపరచిన 'మరియాన్' చిత్రంలోని 'ఇన్నుం కొంజ నేరం' పాటను ఓ పంజాబీ గాయని పాడటాన్ని పోస్ట్ చేశారు.