భారత్ పైలట్ తప్పిపోయిన మాట నిజమే..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్ ఫైలట్ తప్పిపోయిన మాట నిజమేనని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అధికారులు.. పాక్ చెబుతున్న పచ్చి అబద్ధాలను అధికారులు తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా పైలెట్ మిస్సింగ్, మిగ్-21 గురించి క్లారిటీ ఇచ్చారు.
పైలట్ తప్పిపోయిన మాట నిజమే...
"పాకిస్థాన్ విమానాలు మిలటరీ స్థావరాలపై దాడికి యత్నించాయి. పాక్ దాడులను భారత్ దళాలు సమర్థంగా సమర్థవంతగా తిప్పికొట్టాయి. పాక్ యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. పాకిస్థాన్ ఇవాళ ఉదయం భారత్‌పై దాడులకు ప్రయత్నించింది. భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది.
ఇరుదేశాల పరస్పర దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన f-16 ఫైటర్ జెట్‌ను నేలమట్టం చేశాం. అయితే ఈ పోరాటంలో మిగ్-21ను కోల్పోయాం.. పాక్ భూభాగంలో కూలిపోయింది. మన ఐఏఎఫ్ పైలట్ తప్పియారు. పైలట్ అభినందన్ తమ అదుపులో ఉన్నట్లు పాక్ ప్రకటించింది. ఆ వార్తలు నిజమేనని భారత అధికారులు నిర్ధారించారు" అని రవీశ్ కుమార్ మీడియాకు వివరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments