భారత్ పైలట్ తప్పిపోయిన మాట నిజమే..

  • IndiaGlitz, [Wednesday,February 27 2019]

భారత్ ఫైలట్ తప్పిపోయిన మాట నిజమేనని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన అధికారులు.. పాక్ చెబుతున్న పచ్చి అబద్ధాలను అధికారులు తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా పైలెట్ మిస్సింగ్, మిగ్-21 గురించి క్లారిటీ ఇచ్చారు.

పైలట్ తప్పిపోయిన మాట నిజమే...

పాకిస్థాన్ విమానాలు మిలటరీ స్థావరాలపై దాడికి యత్నించాయి. పాక్ దాడులను భారత్ దళాలు సమర్థంగా సమర్థవంతగా తిప్పికొట్టాయి. పాక్ యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. పాకిస్థాన్ ఇవాళ ఉదయం భారత్‌పై దాడులకు ప్రయత్నించింది. భారత సైన్యం పాక్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది.

ఇరుదేశాల పరస్పర దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన f-16 ఫైటర్ జెట్‌‌ను నేలమట్టం చేశాం. అయితే ఈ పోరాటంలో మిగ్-21ను కోల్పోయాం.. పాక్ భూభాగంలో కూలిపోయింది. మన ఐఏఎఫ్ పైలట్ తప్పియారు. పైలట్ అభినందన్‌‌ తమ అదుపులో ఉన్నట్లు పాక్ ప్రకటించింది. ఆ వార్తలు నిజమేనని భారత అధికారులు నిర్ధారించారు అని రవీశ్ కుమార్ మీడియాకు వివరించారు.

More News

యుద్ధం మొదలైతే ఎక్కడికెళ్తుందో తెలీదు: పాక్ ప్రధాని

గత రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తోక ముడిచిన పాకిస్థాన్ తిక్క కుదిరినట్లుంది. అందుకే భారత్‌‌తో చర్చలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదించారు.

వైసీపీ లో చేరిన దగ్గుపాటి, ఆమంచి

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుపాటి హితేశ్ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

సర్జికల్ స్ట్రైక్స్ వీడియోస్‌‌పై క్లారిటీ వచ్చేసింది..

పాక్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌‌లో ఉగ్రవాదుల స్థావరం కుప్పకూలిన సంగతి తెలిసిందే.

మార్చి 15న 'వేర్ ఈజ్ ది వెంక‌ట‌లక్ష్మీ'

గురునాథ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.బి.టి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో కిషోర్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

కుప్పకూలిన విమానం.. ఇద్దరు భారత్ ఫైలెట్లు సజీవ దహనం

భారత్‌‌-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.