ఇప్పుడు బాలయ్య వంతు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఇదివరకు మూడు తెలుగు చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం బాలకృష్ణతో నాలుగో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ తాజా చిత్రంలో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశేషమేమిటంటే.. కె.ఎస్.రవికుమార్ ఇదివరకు తీసిన మూడు తెలుగు చిత్రాల్లో రెండు ఇలాగే డబుల్ రోల్ ఉన్న సినిమాలు కావడం.
చిరంజీవితో రూపొందించిన స్నేహం కోసం తీసుకున్నా.. రాజశేఖర్ తో తెరకెక్కించిన విలన్ తీసుకున్నా.. ఆయా సినిమాల్లో ద్విపాత్రాభినయం ఉంది. గత రెండు సందర్భాల్లో సదరు దర్శకుడుకి ద్విపాత్రాభినయం కలిసిరాలేదు. మరి బాలయ్యతోనైనా ఈ విషయానికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com