రవితేజ సినిమాలో ట్విస్ట్ అదేనట..
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. 'ఖతర్నాక్', 'కిక్', 'దేవుడు చేసిన మనుషులు' సినిమాల తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.
రవితేజకు 'నీ కోసం', 'వెంకీ', 'దుబాయి శీను' లాంటి హ్యాట్రిక్ విజయాలను అందించిన శ్రీను వైట్ల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. అమెరికా బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్‌ను బట్టి రవితేజ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారనీ.. మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించరని తెలుస్తోంది.
ఒకటే పాత్రలో మూడు డిఫరెంట్ గెటప్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నారనీ, సినిమాలో ఇదే అసలైన ట్విస్ట్ అని అంటున్నారు. మరి.. మళ్ళీ విజయాల బాట పట్టాలని ఆశిస్తున్న శ్రీను వైట్ల ఆ డిఫరెంట్ గెటప్స్‌ను ఏ విధంగా తీర్చిదిద్ది ఉంటారోనని ఫిల్మ్ నగర్‌లో ముచ్చటించుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments