ఈ సంక్రాంతికి ఇదే స్పెషల్
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటి తరం నటీనటులు పర భాషా సినిమాలు చేస్తున్నపుడు...వారి పాత్రలకి డబ్బింగ్ కళాకారుల గొంతుపై ఆధారపడడంఅనేది జరుగుతూ ఉండేది. కాని నేటి తరం నటీనటులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. భాష ఏదైనా సరే..వారి పాత్రలకి వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని ప్రేక్షకులకి మరింత దగ్గరౌతున్నారు. తాజాగా అజ్ఞాతవాసి` సినిమాలో నటించిన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ఇద్దరూ కూడా వారి పాత్రలకి వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.
ఈ ఇద్దరూ మలయాళీ భామలు కావడం విశేషం. అలాగే జై సింహా` సినిమాలో నటించిన కన్నడ నటి హరిప్రియ కూడా తనే డబ్బింగ్ చెప్పుకుని అందరిని మెప్పించింది. ఈసారి ఈ జాబితాలోకి తమిళ్ హీరో సూర్య వచ్చి చేరారు. తమిళ్ ఇండస్ట్రీతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య.. తన తాజా చిత్రం గ్యాంగ్` సినిమా కోసం తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ మూడు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించడానికి దిగుతున్నాయి. వీరి సినిమాలతో పాటు వీరి మాటలకి కూడా ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout