ఈసారి రకుల్ వంతు
Send us your feedback to audioarticles@vaarta.com
నటనకు సంబంధించిన నవ రసాల్లో హాస్య రసాన్ని పండించడం కష్టమంటారు సినీ పెద్దలు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు.. అదీ ఈ జనరేషన్ హీరోయిన్లకు హాస్య రసం పండించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే.. భాష కాని భాషలో కామెడీ టైమింగ్ ప్రదర్శించడం అంటే కష్టం.
అయితే దర్శకుడు శ్రీను వైట్ల మాత్రం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని తన హీరోయిన్లకు మంచి కామెడీ టైమింగ్‌తో కూడిన రోల్స్‌ని డిజైన్ చేస్తుంటాడు. 'దూకుడు'లోని సమంత పాత్రతో మొదలుపెడితే.. 'బాద్షా'లో 'బంతి' ఫిలాసఫీ బోధించే కాజల్ క్యారెక్టర్.. అలాగే 'ఆగడు'లోని స్వీట్ షాప్ సరోజగా తమన్నా పాత్ర.. ఇలా అన్నీ కూడా హాస్యాన్ని చిందించే పాత్రలే. ఈ నేపథ్యంలో వైట్ల తాజా చిత్రం 'బ్రూస్లీ' లోనూ ఆ చిత్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ పరంపరని కొనసాగిస్తోంది. ట్రైలర్స్ ని బట్టి చూస్తే రకుల్ తన వంతుగా ఆ పాత్రని పండించే దిశగా తీవ్రంగా శ్రమించిందని అర్థమువుతోంది. మరి వెండితెరపై రకుల్ ఏ మాత్రం ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com