ఈసారి రకుల్ వంతు

  • IndiaGlitz, [Monday,October 05 2015]

న‌ట‌న‌కు సంబంధించిన న‌వ‌ ర‌సాల్లో హాస్య ర‌సాన్ని పండించ‌డం క‌ష్ట‌మంటారు సినీ పెద్ద‌లు. మ‌రీ ముఖ్యంగా హీరోయిన్ల‌కు.. అదీ ఈ జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌కు హాస్య ర‌సం పండించ‌డం కొంచెం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఎందుకంటే.. భాష కాని భాష‌లో కామెడీ టైమింగ్ ప్ర‌ద‌ర్శించ‌డం అంటే క‌ష్టం.

అయితే ద‌ర్శ‌కుడు శ్రీ‌ను వైట్ల మాత్రం ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని త‌న హీరోయిన్ల‌కు మంచి కామెడీ టైమింగ్‌తో కూడిన‌ రోల్స్‌ని డిజైన్ చేస్తుంటాడు. 'దూకుడు'లోని స‌మంత పాత్ర‌తో మొద‌లుపెడితే.. 'బాద్‌షా'లో 'బంతి' ఫిలాస‌ఫీ బోధించే కాజ‌ల్ క్యారెక్ట‌ర్.. అలాగే 'ఆగ‌డు'లోని స్వీట్ షాప్ స‌రోజగా త‌మ‌న్నా పాత్ర‌.. ఇలా అన్నీ కూడా హాస్యాన్ని చిందించే పాత్ర‌లే. ఈ నేప‌థ్యంలో వైట్ల తాజా చిత్రం 'బ్రూస్‌లీ' లోనూ ఆ చిత్ర క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్‌ కూడా ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తోంది. ట్రైల‌ర్స్ ని బ‌ట్టి చూస్తే ర‌కుల్ త‌న వంతుగా ఆ పాత్ర‌ని పండించే దిశ‌గా తీవ్రంగా శ్ర‌మించింద‌ని అర్థ‌మువుతోంది. మ‌రి వెండితెర‌పై ర‌కుల్ ఏ మాత్రం ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

రామ్ కి ఎంతో స్పెషల్...

కథానాయకుడుడిగా రామ్ ఎంట్రీ ఇచ్చి రానున్న సంక్రాంతితో పదేళ్లు పూర్తి కానుంది.అయితే ఈ తొమ్మిదేళ్లలో ఏ సంవత్సరం జరగని విషయం ఈ సంవత్సరంలో చోటు చేసుకోనుంది రామ్ విషయంలో.

నాగ్ సినిమాకీ అన్నిశుభ శకునములే

'మనం'వంటి మెమరబుల్ మూవీ తరువాత నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'.ఈ సినిమా కోసం నాగ్ రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు.

అందుకనే 'రుద్రమదేవి' చరిత్రను వక్రీకరించకుండా చిత్రీకరించాను - గుణ శేఖర్

అందాల తార అనుష్క ప్రధాన పాత్రలో గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి.ఈ సినిమాలో రానా,అల్లు అర్జున్,క్రిష్ణంరాజు,నిత్యామీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

తమన్నా ఏ మాత్రం తగ్గట్టేదు

'బాహుబలి'విజయంతో తమన్నా క్రేజ్ మరింత పెరిగింది.ఇప్పుడు ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని తమన్నాని అప్ కమింగ్ సినిమాల్లో గ్లామర్ పరంగా బాగానే వాడుకుంటున్నారు

నిన్న గోపీచంద్... నేడు అజిత్..

కెమెరామేన్ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయిన 'శౌర్యం'శివ..ప్రస్తుతం తమిళంలో అజిత్ తో 'వేదాళం'అనే సినిమా రూపొందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.