కరోనా ఎఫెక్ట్: ‘అరణ్య’ వాయిదా

  • IndiaGlitz, [Monday,March 16 2020]

అనుకున్నట్లే అయ్యింది. రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘అరణ్య’. తమిళంలో కాడన్, హిందీలో హథీ మేరే సాథీ పేర్లతో మూడు భాషల్లో సినిమా రూపొందింది. ఏప్రిల్ 2న మూడు భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌భుత్వాల‌న్నీ సినిమా థియేట‌ర్స్‌ను మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఈ నెల 31 త‌ర్వాత ప్ర‌భుత్వాలు త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉగాది సందర్భంగా విడుద‌ల కావాల్సిన సినిమా వాయిదా ప‌డ్డాయి. అదే క‌రోనా కార‌ణంతో త‌మ అర‌ణ్య సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించగా తనదైన శైలిలో ప్రభు సాల్మన్ అరణ్య చిత్రాన్ని అడవుల్లో, ఏనుగుల‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమాలో 30 ఏనుగుల‌తో రానా న‌టించడం విశేషం. మానవజాతి  కజిరంగ, అస్సోమ్‌ ప్రాంతాల్లోని ఏనుగుల అవాస ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను  రూపొందిస్తున్నారు. అడవిలోనే ఉంటూ తన జీవితాన్ని అడవి, అందులో జంతు సంరక్షణకు ఓ వ్యక్తి ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది.

More News

కరోనా వైరస్‌పై సినిమా.. తొలి టైటిల్ ఏంటో తెలుసా?

సినిమా వాళ్లు సినిమా వాళ్లే.. ఓ విష‌యాన్ని సినిమా కోణంలో ఆలోచిస్తుంటారు. తాజాగా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ భ‌య‌పెడుతుంది.

టాలీవుడ్‌ సినిమా షూటింగ్స్‌ అన్నీ నిలిపివేత..

టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకుంది.

మ‌రోసారి ప్ర‌భాస్ గురించి చెప్పిన అనుష్క ఏమందో తెలుసా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని, వారు పెళ్లి చేసుకుంటార‌ని ప‌లు సంద‌ర్భాల్లో ప‌లు ర‌కాలుగా వార్త‌లు వినిపించాయి.

విశ్వ‌క్ సేన్‌ని ఆ సినిమాలో తీసేశారు.. త‌ర్వాత ఏమైందో తెలుసా?

ఇటీవ‌ల విడుద‌లైన ‘హిట్‌’తో హిట్ అందుకున్న హీరో విశ్వ‌క్‌సేన్‌. ఈ యంగ్ హీరో కెరీర్ సాఫీగా ఏం సాగిపోలేదు.

కలకలం.. గోల్కొండ టోలీచౌక్‌లో కరోనా అనుమానిత కేసు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..