కరోనా ఎఫెక్ట్: ‘అరణ్య’ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
అనుకున్నట్లే అయ్యింది. రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో ప్రభుసాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అరణ్య’. తమిళంలో కాడన్, హిందీలో హథీ మేరే సాథీ పేర్లతో మూడు భాషల్లో సినిమా రూపొందింది. ఏప్రిల్ 2న మూడు భాషల్లో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాలన్నీ సినిమా థియేటర్స్‌ను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ నెల 31 తర్వాత ప్రభుత్వాలు తదుపరి నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడ్డాయి. అదే కరోనా కారణంతో తమ అరణ్య సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని ప్రకటించింది.
రానా దగ్గుబాటి టైటిల్ పాత్రలో, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించగా తనదైన శైలిలో ప్రభు సాల్మన్ అరణ్య చిత్రాన్ని అడవుల్లో, ఏనుగులతో తెరకెక్కించారు. ఈ సినిమాలో 30 ఏనుగులతో రానా నటించడం విశేషం. మానవజాతి కజిరంగ, అస్సోమ్ ప్రాంతాల్లోని ఏనుగుల అవాస ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అడవిలోనే ఉంటూ తన జీవితాన్ని అడవి, అందులో జంతు సంరక్షణకు ఓ వ్యక్తి ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout