అధికారిక ప్రకటన.. ‘వి’ వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’. ఇందులో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. విడుదలైన నాని ఫస్ట్ లుక్ చూస్తుంటే అలాగే ఉంది. అలాగే సుధీర్‌బాబు ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనపడుతున్నారు. నివేదా థామస్, అదితిరావ్ హైదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కరోనా వైరస్(కొవిడ్ 19) కారణంగా ఈ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్నీ పరిస్థితులు అనుకూలమైతే ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇటీవల వీరిద్దరి ఫస్ట్ లుక్స్‌తో పాటు సినిమా టీజర్‌ను, రెండు లిరికల్ వీడియో సాంగ్స్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుండి చాలా మంది స్పందన వచ్చింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నానితో ‘అష్మాచమ్మా’, ‘జెంటిల్‌మన్’..సుధీర్ ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com